సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది.మార్చి నెల వచ్చిందో లేదో.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటు తున్నాయి.ఉదయం పది గంటలకే భానుడు భగ భగ మంటున్నాడు.
దాంతో ప్రజలు బయట కాలు పెట్టడానికే జంకు తున్నారు.ఇక వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడు కోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
వాటిలో టీ, కాఫీలకు దూరంగా ఉండాలనేది కూడా ఒకటి.ఎందుకంటే.
సమ్మర్‌లో టీ, కాఫీలను తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే టీని తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలను కూడా పొందొచ్చు.మరి లేటెందుకు ఆ `టీ` ఏంటో.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.చూసేయండి.
ముందుగా ఒక చిన్న దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి.అలాగే గుప్పెడు పుదీనా ఆకులను వాటర్‌తో వాష్ చేసి మెత్తగా నూరి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టీను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీ, మూడు టేబుల్ స్పూన్ల దోసకాయ పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకుని పది నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై దీనిని వడబోసి రుచికి సరిపడా తేనె, రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే టేస్టీ టేస్టీ దోసకాయ పుదీనా గ్రీన్ టీ సిద్ధమైనట్టే.
ఈ టీని వేసవి కాలంలో రోజుకు ఒక కప్పు చొప్పున తీసుకుంటే.
బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.వేసవి వేడి వల్ల వచ్చే నీరసం, అలసట, తలనొప్పి వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.
వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
మరియు చర్మం కాంతి వంతంగా కూడా మెరుస్తుంది.