కామ్రేడ్ ఠానునాయక్ విగ్రహం ట్యాంక్ బండ్ పై పెట్టాలి:మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధులు జాటోత్ ఠాను నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.సోమవారం గిరిజన సంఘం జిల్లా కార్యాలయంలో ఠాను నాయక్ 73వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

 Comrade Thanunayak's Statue Should Be Placed On Tank Embankment Mallu Nagarjuna-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో పిడిత ప్రజల విముక్తి కోసం నాటి నిజాం రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగా సాయుధ పోరాటంలో తుపాకీ చేత బట్టి,గిరిజన తండలా విముక్తికై పోరాడి నేల కొరిగిన వీరుడు కామ్రేడ్ ఠాను నాయక్ అని కొనియాడారు.తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భానోత్ రాజేందర్ నాయక్ మాట్లాడుతూ నాడు నిజామ్ సైన్యం చేసిన దూరాగతాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి,భూమిలేని పేదలకు భూమి పంచిన వీరుడు ఠాను నాయక్ అని అన్నారు.

నేటి పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల పేదలు గిరిజనులు బతకలేని స్థితిలో ఉన్నారని,విద్య, వైద్యంతో పాటు అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేశారాని అన్నారు.ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం చెందాయని,భూమి లేని గిరిజన పేదలకు మూడు ఎకరాలు భూమి ఇవ్వాలని,గిరిజన బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గిరిజనులకు ఇండ్లు,ఇండ్లస్థలాలు ఇవ్వాలన్నారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, సిఐటియు జిల్లా నాయకులు కోలిశెట్టి యాదగిరిరావు,చెరుకు ఏకలక్ష్మి,జిల్లా అధ్యక్షులు రాంబాబు,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వినోద్,ధనియాకుల శ్రీకాంత్,పట్నం జిల్లా కార్యదర్శి జె.నరసింహారావు, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిన్నపంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube