టేకుమట్ల నర్సరీని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్...!

సూర్యాపేట జిల్లా: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు గురువారం మధ్యాహ్నం సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో పెంచుతున్న నర్సరీలను ఆకస్మికంగా పరిశీలించారు.

 District Collector S Venkatrao Sudden Visit To Tekumatla Nursery, District Colle-TeluguStop.com

నర్సరీలో 60 శాతం (జర్మినేషన్) విత్తనోత్పత్తి లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ సెక్రెటరీ నరసింహారావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.నర్సరీలో ఉన్న మొక్కలకు వాటరింగ్ చేయకపోవడంపై,నర్సరీ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్యపై శాఖ పరమైన చర్యలు తీసుకోవలసిందిగా,అనంతరం ప్రక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండి మొక్కలకు నీరు పెట్టకపోవడంపై కలెక్టర్ పంచాయతీ సెక్రటరీ నరసింహారావు మందలించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు పంచాయతీ సెక్రటరీ షోకాజ్ నోటీస్ ఇవ్వవలసిందిగా కలెక్టర్ డీపీఓను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకం,నర్సరిల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మండల స్పెషల్ ఆఫీసర్లు అభివృద్ది పనుల నిరంతర పర్యవేక్షణ చేయాలని నర్సరీలను ఆకస్మికంగా సందర్శించి నివేదిక అందజేయాలని తెలిపారు.ముందుగా టేకుమట్ల గ్రామ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ధాన్యం తేమ శాతాన్ని మిషన్ ద్వారా కలేక్టర్ పరిశీలించారు.

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు తెలపాలని పేర్కొన్నారు.

పిఎసిఎస్ వారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వార కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేశారా లేదా అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ కొరకు మండల,డివిజన్,జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య,తాహాసిల్దార్ ఎంకన్న,ఏవో జానీమియా, పిఎసిఎస్ సెక్రటరీ వాసు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube