చలికాలంలో వేరుశనగలు తింటున్నారా.. మరి మీకు ఈ విషయాలు తెలుసా?

వేరుశనగలు.( Groundnuts ) వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.నిత్యం వంటల్లో వేరుశనగలను విరివిరిగా వాడుతుంటారు.ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో చాలా మంది వేరుశనగలతో చట్నీ తయారు చేస్తుంటారు.అలాగే తాలింపులో కూడా వేరుశనగలను వినియోగిస్తుంటారు.అయితే ప్రస్తుత చలికాలంలో వేరుశనగలను తినొచ్చా.? తినకూడదా.? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.కొందరు అలర్జీలు వస్తాయని, తినకూడదని వాటిని పక్కన పెట్టేస్తుంటారు.అలాగే మరికొందరు అదేమీ పట్టించుకోకుండా తింటారు.నిజానికి చలికాలంలో ఎలాంటి భయం లేకుండా వేరుశనగలను తినొచ్చు.వేరుశనగలు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.

 Benefits Of Eating Groundnuts During Winter Season , Groundnuts, Groundnut-TeluguStop.com

చలికాలంలో ఆరోగ్యపరంగా వేరుశనగలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.ప్రతిరోజు గుప్పెడు వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే మస్తు ఆరోగ్యం లాభాలు పొందవచ్చు.

Telugu Groundnuts, Tips, Latest-Telugu Health

చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే సామర్థ్యం వేరుశనగలకు ఉంది.వీటిని తీసుకుంటే సమర్థవంతంగా చలి పులిని ఎదుర్కోవచ్చు.అలాగే వేరుశనగలను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో సీజన‌ల్‌ వ్యాధులు( Seasonal diseases ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చర్మం పొడి బారిపోయి నిర్జీవంగా, కాంతిహీనంగా త‌యార‌వుతుంది.అయితే వేరుశనగలు ఆ సమస్యకు చెక్ పెడతాయి.

వీటిని తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా మారుస్తుంది.

Telugu Groundnuts, Tips, Latest-Telugu Health

అంతేకాదు వేరుశనగలను ఆహారంలో భాగం చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్( Alzheimers ) వచ్చే ప్రమాదం తగ్గుతుంది.ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.

జీర్ణ క్రియ మెరుగుపడే మలబద్ధకం సమస్య( Constipation ) సైతం దూరం అవుతుంది.అయితే వేరుశ‌న‌గ‌లు చ‌లికాలంలో ఆరోగ్యానికి మంచివే.

కానీ, అతిగా తీసుకుంటే మాత్రం లేనిపోని స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.ముఖ్యంగా వేరుశన‌గ‌ల‌ను అధిక మొత్తంలో వాడ‌టం వ‌ల్ల కొలెస్ట్రాల్ భారీగా పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు కూడా పెరుగుతుంది.మ‌రియు వేరుశ‌న‌గ‌ల‌ను అతిగా తింటే షుగ‌ర్ లెవెల్స్( Sugar levels ) సైతం కంట్రోల్ తప్పుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube