అమెరికా : అదృశ్యమైన భారత సంతతి యువకుడి కథ విషాదాంతం .. సరస్సులో శవమై తేలిన టెక్కీ

అమెరికాలో( America ) భారత సంతతికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్( Software Engineer ) అదృశ్యం కథ విషాదాంతమైంది.ఏప్రిల్ 9న మిస్సయిన 30 ఏళ్ల టెక్కీ మృతదేహాన్ని మేరీల్యాండ్‌లోని ( Maryland ) చిన్న సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 Body Of Missing Indian-american Software Engineer Found In Lake Churchill In Mar-TeluguStop.com

మృతుడిని అంకిత్ బగైగా( Ankit Bagai ) గుర్తించారు.మంగళవారం లేక్ చర్చిల్‌లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.మృతదేహాన్ని వెలికి తీసి, అనంతరం చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు.

మృతుడిని జర్మన్‌టౌన్‌కు చెందిన అంకిత్ బగైగా గుర్తించినట్లు మోంటో‌గోమెరీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

అతని కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.

అంకిత్ జర్మన్‌టౌన్‌లోని ఓ ఆసుపత్రి నుంచి అదృశ్యమయ్యాడు.చివరిసారిగా 12000 పాంథర్స్ రిడ్జ్ డ్రైవ్‌లో కనిపించాడు.

బగై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని.నిత్యం మందులను వాడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

అంకిత్ అదృశ్యం కావడంతో అతని కోసం తీవ్రంగా గాలించిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.అంతేకాకుండా అంకిత్ ఆచూకీ తెలిపిన వారికి 5 వేల డాలర్ల రివార్డ్‌ను కూడా ప్రకటించారు.

Telugu Ankit Bagai, German Town, Indian American, Lake Churchill, Maryland, Nris

అటు పోలీసులు కూడా అంకిత్ కోసం తీవ్రంగా గాలించారు.ఈ క్రమంలో అతని వివరాలతో కూడిన ఫేస్‌బుక్ పేజీని కూడా ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో అంకిత్ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.వర్జీనియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న అంకిత్.సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.టైగర్ వుడ్స్‌ను అమితంగా ఇష్టపడే అంకిత్‌‌కు కుటుంబమంటే ప్రాణమని పోలీసులు ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు.

Telugu Ankit Bagai, German Town, Indian American, Lake Churchill, Maryland, Nris

ఇదిలావుండగా.తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన హేమంత్ శివరామకృష్ణ అనే విద్యార్ధి అమెరికాలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.బార్బడోస్‌లోని ఓ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అతను గత మంగళవారం మిత్రులతో కలసి బీచ్‌లో స్విమ్మింగ్ చేసి ఆనందంగా గడిపాడు.ఈ క్రమంలో బీచ్‌లో వుండగానే హేమంత్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

దీంతో మిత్రులు అతనిని ఆసుపత్రికి తరలించగా.అప్పటికే హేమంత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube