తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు:ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:భారత రాష్ట్ర సమితి అంటూ తన పార్టీ పేరు మార్పును గొప్పగా వర్ణిస్తున్న కేసీఆర్ తీరు ఓడమీద ఉన్నంత సేపు ఓడ మళ్లయ్య ఓడ దిగినంక బోడ మల్లయ్య అన్న చందంగా వుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ధర్మార్జున్ విమర్శించారుశనివారం జిల్లా కేంద్రంలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ పదవి ఇవ్వకపోతే అలిగి ఒంటరిగా మిగిలిన కేసీఆర్, అప్పటికే ప్రజా సంఘాల ఆధ్వర్యలో సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని వరంలా ఉపయోగించుకున్నాడని,చీమలు పెట్టిన పుట్టలో పాములు జొరబడ్డ మాదిరిగా తెలంగాణ అస్తిత్వం కోసం, అమరవీరుల త్యాగాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో జొరబడి తన రాజకీయ లబ్దికోసం,తన కుటుంబ అభివృద్ధి కోసం బాగా ఉపయోగించుకున్నాడని అన్నారు.తెలంగాణ ఉద్యమ ఎదుగుదలను తన రాజకీయ ఎదుగుదలకు మెట్లుగా మార్చుకొని,మిగతా ఉద్యమ శక్తులను నీరు గార్చి,ఉద్యమ ఆకాంక్షల సాధనకు తనకు ఓటువేయాలని ప్రజలను నమ్మించి అధికారం చేజిక్కించుకొన్నాడని పేర్కొన్నారు.

 Kcr Cheated People Of Telangana: Dharmarjun-TeluguStop.com

అధికారం వచ్చాక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను గాలికొదిలేశాడని దుయ్యబట్టారు.గత ఎనిమిదేళ్లుగా కాంట్రాక్టులు,కమీషన్ లే లక్ష్యంగా పనిచేస్తూ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

ప్రజలను సంక్షేమ పథకాల భ్రమలో వుంచి కేసీఆర్,ఆయన కుటుంబం,అనుచరులు మాత్రం పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.దేశానికి తెలంగాణ మోడలంటూ గొప్పలు పోతున్న టిఆర్ఎస్ నాయకులు అసలు ఆ మోడల్ ఏంటో బహిరంగ చర్చకు సిద్ధమా సవాల్ విసిరారు.

తెలంగాణ మౌలిక అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిలదీస్తారనే భయంతో మళ్ళీ రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే బీఆర్ఎస్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని,తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకున్నాడని,ఇది కేసీఆర్ మెడకు చుట్టుకున్న పాములా మారి కాటేయడం ఖాయమన్నారు.ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాండ్ర మల్లయ్య యాదవ్,మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ రఫీ,లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్ వీరేష్ నాయక్,యువజన సమితి రాష్ట్ర నాయకులు బొడ్డు శంకర్ గౌడ్,ఎస్సీ సెల్ జిల్లా కో కన్వినర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube