సూర్యాపేట జిల్లా:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు శుక్రవారం కోదాడ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.అనంతరం సబ్ స్టేషన్ నుండి ఖమ్మం క్రాస్ రోడ్డు వరకు ప్రదర్శన చేసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ జామ్ కావడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి.ఈ రాస్తారోకోని ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనగాల వెంకట్రామయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలపై పెనుభారం మోపిందని ఆరోపించారు.
సుమారు 5600 కోట్లు రూపాయలను విద్యుత్ వినియోగదారులపై మోపుతుందని,ఇది గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి దారుణమని ఎద్దేవా చేశారు.దొంగే దొంగా దొంగా అన్నచందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిందించడం హేయమైన చర్యని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు.కేసీఆర్ పతనం ప్రారంభమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన,వాణిజ్య సెల్ కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు,బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ కార్యదర్శి కనగాల నారాయణ, వంగాల పిచ్చయ్య,మైనార్టీ నాయకుడు సయ్యద్ హుస్సేన్,యరగాని రాధాకృష్ణ,చిలుకూరు శ్రీనివాసరావు,మునగాల శ్రీనివాసరావు,వెలుగోడు చిట్టిబాబు,దేవరశెట్టి సత్యనారాయణ,చల్లా వినాయకరావు,కనగాల పుల్లయ్య,లక్ష్మయ్య,వెంకట నారాయణ,రామయ్య,లక్ష్మి,శైలజ,సత్యనారాయణ, రామయ్య,తదితరులు పాల్గొన్నారు.