పెరిగిన దిగుబడితో దిగివస్తున్న టొమాటో ధర...కిలో @ రూ.25

హైదరాబాద్‌/నల్లగొండ జిల్లా:టొమాటో కొంటే కాదు వింటేనే భయపడేలా ధర పలికింది.ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.300,తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్‌ చేసిన కిలో టొమాటో ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతూ కిందికి ధర దిగి వస్తున్నది.మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనేది మార్కెట్‌ వర్గాల టాక్‌.రాయలసీమలోని అనంతపురం,చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టొమాటో రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు.

 Price Of Tomato Coming Down With Increased Yield Per Kg @ Rs.25, Tomato-TeluguStop.com

హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి,వికారాబాద్‌, మెదక్‌ నుంచి కూడా టొమాటో అధికంగా వస్తున్నది.తాజాగా ఏపీలోని మదనపల్లె మార్కెట్‌లో టొమాటో ధరలు భారీగా తగ్గాయి.శుక్రవారం మార్కెట్‌కు దాదాపు 400 టన్నుల టొమాటో రావడంతో ధర మరింత పడిపోయింది.మొదటి రకం టొమాటో కిలో రూ.30 నుంచి రూ.40 పలికింది.రెండో రకం టొమాటో కిలో రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube