సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నెల వారి పోలీస్ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ అధ్వర్యంలో పోలీసు అధికారులకు ధ్యానం, యోగా శిక్షణ తరగతి నిర్వహించారు.
అనంతరంజిల్లాలో కేసుల నమోదు, పెండింగ్ కేసుల వివరాలు, కోర్టు కేసుల స్థితిగతులు, విజువల్ పోలీసింగ్ నిర్వహణ,కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు, పోలీస్ పని విభాగాల నిర్వహణ మొదలగు అంశాలపై సమీక్ష నిర్వహించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది వత్తిడి లేకుండా పని చేయాలని,విధులు నిర్వహణతో పాటుగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రశాంతంగా ఉన్నప్పుడే లక్ష్యం వైపు పట్టుదలతో పని చేస్తామన్నారు.కేసుల దర్యాప్తులో సాంకేతికతను జోడించి నైపుణ్యంతో పని చేయాలని అన్నారు.
కేసుల దర్యాప్తులో ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచనలు చేశారు.
సాంకేతిక ఆధారాలకు నిపుణుల నిర్ధారణ తీసుకోవాలన్నారు.
రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాలని,రోడ్డు ప్రమాదం సంభవిస్తే మరల ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరగకుండా లోపాలను సవరించాలని అన్నారు.పోలీసింగ్ విధి విధానాలపై స్టేషన్ నిర్వహణపై డిఎస్పీలు, సిఐలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండాలని సిబ్బందికి అవసరమైన సలహాలు సూచనలు అందించాలన్నారు.
అనంతరం రోడ్డు సేఫ్టీ పోర్టల్ నందు డేటా అప్లోడ్ చేయడంపై నిపుణులతో శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
కేసుల చేధనలో ఎంతో ఉపయోగకరమైన కాల్ డేటా ఇచ్చే జియో, ఎయిర్టెల్ నోడల్ అధికారులు హరిప్రసాద్, నారాయణను ఎస్పీ సన్మానించారు.
సమీక్షా సమావేశం నందు హార్ట్ ఫుల్ నెస్ సంస్థ మాస్టర్ గోవర్ధన గిరి అధ్వర్యంలో పోలీసు అధికారులకు ధ్యానం,యోగా శిక్షణ తరగతి నిర్వహించడం జరిగినది.విధులతో పాటుగా ఆరోగ్యం కూడా ముఖ్యమని,మనసు, వృదయం ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆనందంగా ఉంచుకోవడం కోసం యోగా,ధ్యానం చేయాలని అన్నారు.
త్వరలో సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి,ఏఓ సురేష్ బాబు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసీఅర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ,సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజేష్, అంజనేయులు,శివశంకర్, పీ ఎన్ డి ప్రసాద్, నాగర్జున,రాజశేఖర్, గౌరినాయుడు,ఆర్ఐలు శ్రీనివాసరావు,శ్రీనివాస్, నర్సింహారావు, గోవిందరావు,సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్.
హార్ట్ ఫుల్ నెస్ సంస్థ మాస్టర్ గోవర్ధన గిరి,చంద్ర శేఖర్,కాల్ డేటా నోడల్ అధికారులు పాల్గొన్నా
.