యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి పట్టణం పాత శిల్ప హోటల్ ( Old Shilpa Hotel )వెనకాల అప్పుడే పుట్టిన పసిగుడ్డును కర్కశంగా చెట్ల పొదల్లో పడేసిన కసాయి తల్లిదండ్రుల ఉదంతం శనివారం పట్టణంలో కలకలం రేపింది.పారవేసిన బిడ్డను కుక్కలు,పందులు పీక్కు తిని,రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన దృశ్యం హృదయ విదారకంగా కనిపించి,చూసేవారికి కన్నీళ్లు పెట్టించింది.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.