సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ ఏరియాలో వ్యవసాయ శాఖ అధికారులు, పట్టణ సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.దుకాణాల్లో నిల్వ ఉన్న విత్తనాల నాణ్యత,లేబుల్,బిల్స్,బ్రాండ్ మార్క్ ఇలా పలు అంశాలను పరిశీలించారు.
అనంతరం పట్టణ సిఐ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్దం అవుతున్నారని,ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని,రైతు మోసపోవద్దని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీలు చేసినట్లు తెలిపారు.రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని,విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని తనిఖీ చేసుకోవాలని,అవసరమైతే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో పట్టణ ఎస్ఐ శ్రీనివాస్,వ్యవసాయ అధికారి జానిమియా,సిబ్బంది పాల్గొన్నారు.