1.బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన
తమ సమస్యలు తీర్చాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యమించిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు.అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు విద్యార్థులు నిరసన తెలిపారు.
2.విద్యార్థులను పరామర్శించిన నారాయణ
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రిపుల్ ఐటి విద్యార్థులను సిపిఐ నేత నారాయణ పరామర్శించారు.
3.టిఆర్ఎస్ పై మాణిక్యం ఠాగూర్ విమర్శలు
టిఆర్ఎస్ విద్యాశాఖ మంత్రి విద్యార్థుల సంక్షేమమే కాకుండా ఇతర సంక్షేమాలను చూస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యంఠకూర్ విమర్శించారు.
3 గోదావరి పరివాహక ప్రాంతాల్లో కెసిఆర్ ఏరియల్ సర్వే
భారీ వర్షాలు నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో కేసిఆర్ ఏరియల్ సర్వే కొనసాగుతోంది.
4.మైలవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది.మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి క్యాంటీన్ ప్రారంభించారు.
5.ఢిల్లీ చేరుకున్న ఏపీ గవర్నర్
ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ర ఢిల్లీ చేరుకున్నారు.రెండు రోజుల పాటు ఢిల్లీలోనే గవర్నర్ ఉండబోతున్నారు.
6.జగన్ పై లోకేష్ విమర్శలు
రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ జగన్ పట్టించుకోవడంలేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
7.కేఏ పాల్ నిరసన దీక్ష
విబజన హామీలు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మౌన దీక్ష చేపట్టారు.
8.పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా పెరిగిన వరద
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది.స్పిల్ వే వద్ద నీటిమట్టం 36.76 చేరింది.
9.జనసేన ఆందోళన
ఏపీలో రహదారుల అద్వాన్న పరిస్థితి పై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
10.తుంగభద్ర 30 గేట్లు ఎత్తివేత
తుంగభద్ర నదికి భారీగా వరద నీరు పెరుగుతుండడంతో, ప్రాజెక్టుకు ఉన్న 30 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
11.ఎన్నారై టిడిపి ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకం
ఒమన్ కత్తర్, కువైట్ 1, 2 , యూఏఈ ,యూఎస్ఏ ఎన్ఆర్ఐ టిడిపి ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు నియమించారు.
12.ప్రధాని ఏపీలో పర్యటించాలి : రామకృష్ణ
తెలుగు రాష్ట్రాల్లో వరదలు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని , ఆయా ప్రాంతాలను పరిశీలించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించాలని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
13.బెస్ట్ ఎంబిబిఎస్ స్టూడెంట్ గా డాక్టర్ హరి శంకర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిట్టచివరి స్టేట్ వైడ్ బెస్ట్ అవుట్ గోయింగ్ ఎంబిబిఎస్ స్టూడెంట్ గా డాక్టర్ పూనాటి హరిశంకర్ రికార్డ్ సృష్టించారు.ఉస్మానియా రీజినల్ పరిధిలో ఫైనల్ ఎంబిబిఎస్ లో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు, కంబైన్డ్ స్టేట్ లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా ఆయన నిలిచారు.
14.కేంద్ర మంత్రితో సుదీప్ భేటీ
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాత్యులు ప్రహ్లాద్ జోషితో హీరో సుదీప్ భేటీ అయ్యారు.
15.చంద్రబాబుపై విజయ్ సాయి రెడ్డి కామెంట్స్
అదాన్ కంపెనీ తనదేనని టిడిపి దృష్ప్రచారం చేస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విమర్శించారు.
16.ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణలో వరదల పరిస్థితిని వివరిస్తూ జాతీయ విపత్తుగా పరిగణించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాశారు.
17.రేపు తెలంగాణ గవర్నర్ భద్రాచలం పర్యటన
రేపు తెలంగాణ గవర్నర్ తమిళ సౌందర్య రాజన్ భద్రాచలంలో పర్యటించనున్నారు.వరద బాధితులను పరామర్శించేందుకు ఆమె సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వరకు రైలులో ప్రయాణించనున్నారు.
18.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,044 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.మంకీ ఫాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
మంకీ ఫాక్స్ కేసు కేరళలో వెలుగుచూసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.తెలంగాణలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.
20.వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం తక్షణ సాయం
గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబానికి 25 కేజీల బియ్యం, 2 వేల రూపాయల నగదును అందించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.