సూర్యాపేట జిల్లా:జిల్లాలో పిల్లలు చదువుతో పాటు కళలు,క్రీడలు అలాగే అన్ని రంగాలలో రాణించి జిల్లాకు మంచి పేరుప్రతిష్ఠలు అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సోమవారం స్థానిక బాల భవన్ లో వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మంట్లాడుతూ జిల్లాలో ఉన్న బాల కేంద్రాన్ని బాల భవన్ గా అప్ గ్రేడ్ గా చేయడం జరిగిందన్నారు.పిల్లల తల్లిదండ్రులు పిల్లల అభిరుచి మేరకు ప్రోత్సహించాలని అన్నారు.
పిల్లలు చదువుతో పాటు మానసిక వికాసంపై మక్కువ చూపాలని ఆదిశగా అన్ని రంగాలలో రాణించాలని అన్నారు.వేసవి శిబిరంలో 800 మందికి వివిధ కలలపై నాణ్యమైన శిక్షణ ఇచ్చామని తెలిపారు.
బాల భవన్ నిర్మాణానికి ఇప్పటికే రెండు స్థలాలు పరిశీలించామని రెండువేల పిల్లలు శిక్షణ పొందేలా అద్భుతమైన బాలభవన్ నిర్మించడం జరుగుతుందని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.అనంతరం శిక్షణ పొందిన పిల్లలకు ప్రశంశ పత్రాలు అందచేసి అభినందించారు.
లక్షా యాభై వేల విలువగల వాయిద్యాలను విద్యుత్ శాఖ అధికారులు మంత్రి చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో బాల భవన్ వ్యవస్థాపక అధ్యక్షలు వనమా రామయ్య,మున్సిపల్ చైర్ పర్సన్ పి.అన్నపూర్ణ,జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్,కౌన్సిలర్ తహేర్ పాషా, డి.ఈ.ఓ అశోక్,పర్యవేక్షకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.