మనం ప్రతి రోజు చేసుకొనే కూరల్లో ఉప్పు తప్పనిసరిగా ఉండాల్సిందే.ఊపు లేనిదే గడవదు.
అయితే ఉప్పు ఎక్కువైతే హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అంతేకాక రక్తపోటు ఉన్నవారు ఉప్పును చాలా తక్కువగా ఉపయోగించాలి.
ఉప్పుకు బదులు సైంధవ లవణంను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అంతేకాక మనం రోజు వాడే ఉప్పు కన్నా సైంధవ లవణం చాలా తక్కువ పడుతుంది.
అంటే మూడు స్పూన్ల ఉప్పును వాడే బదులు రెండు స్పూన్ల సైంధవ లవణం సరిపోతుంది.
సైంధవ లవణాన్ని స్వచ్ఛమైన ఉప్పు అంటారు.
కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ వంటి 84 రకాల పోషకాలు ఉంటాయి.ఇవి మన శరీరానికి అవసరమైన పోషణను ఇస్తాయి.
సైంధవ లవణాన్ని తీసుకోవటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా బాగా సహాయపడుతుంది.
స్నానము చేసే నీటిలో కొంచెం సైంధవ లవణంను వేసి స్నానము చేస్తే శరీరం నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పుకు బదులు సైంధవ లవణంను వాడితే మంచి ఫలితం కనపడుతుంది.
అజీర్ణ సమస్య ఉన్నవారు భోజనం అయ్యాక మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
వాంతులు అవుతున్నప్పుడు జీలకర్ర,సైంధవ లవణం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
ఆకలి లేనివారు సైంధవ లవణం, పసుపు, శొంఠి పొడి కలిపి తింటే ఆకలి పెరుగుతుంది.అలాగే జీవక్రియ కూడా బాగా జరుగుతుంది.