తెలుగు బిగ్‌బాస్ రెండవ సీజన్‌లో ఎలిమినేట్ అయిన ఆరుగురులోంచి నూతన్ నాయుడు మరియు శ్యామలలు రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.బిగ్‌బాస్ నిర్వాహకులు ఆరుగురికి ఓటింగ్ నిర్వహించి, వచ్చిన ఓట్ల ద్వారా వీరిద్దరిని ఇంట్లోకి పంపించడం జరిగింది.
మొదట ఒక్కరినే ఇంట్లోకి పంపించబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది.అయితే దాదాపు 12 కోట్ల ఓట్లు నమోదు అయ్యాయి అని, భారీ ఎత్తున వీరిద్దరు ఇంట్లో ఉండాలని కోరుకున్నారు అంటూ నాని ప్రకటించి వీరిద్దరికి రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది.
నిన్నటి ఎపిసోడ్‌లో నూతన్ నాయుడు మరియు శ్యామలలు రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
నూతన్ నాయుడు వ్యవహారంలో మొదటి నుండి కూడా ఏదో అనుమానాలు కొడుతూనే ఉన్నాయి.రాజకీయంగా ఎదిగేందుకు నూతన్ నాయుడు బిగ్‌బాస్‌ను ఆశ్రయించాడు అని, నాుగు కోట్లు ఇచ్చి మరీ బిగ్‌బాస్‌లో స్థానం దక్కించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.నాలుగు కోట్లు ఇచ్చిన వ్యక్తిని రెండు వారాలకే నిర్వాహకులు ఎలా ఎలిమినేట్ చేస్తారు.
అందుకే నాలుగు కోట్ల విషయం అనేది పుకార్లే అయ్యి ఉంటాయి.ఇక నూతన్ నాయుడు రీ ఎంట్రీ కోసం భారీ ఎత్తున ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
నూతన్ నాయుడు బయటకు వెళ్లిన తర్వాత పరిస్థితులపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.ఇంట్లో ఉన్న కౌశల్‌కు ఏ స్థాయిలో బయట ఫ్యాన్స్ పెరిగారో గుర్తించాడు.
ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయిన వారు రీ ఎంట్రీ ఇవ్వొచ్చు అని చెప్పారో అప్పటి నుండి ప్రమోషన్ ప్రారంభించాడు.కౌశల్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ, కౌశల్ ఆర్మీని ప్రసన్నం చేసుకునేందుకు విపరీతంగా ప్రయత్నించాడు.
దాంతో పాటు పెద్ద ఎత్తున వీడియోలు, తన బైట్స్ సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో అందరు చూసేలా చేశాడు.బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న రెండు వారాలే అయినా కూడా వందకు పైగా వీడియోలను రెడీ చేయించి సోషల్ మీడియాలో వదిలాడు.
సోషల్ మీడియా ప్రమోషన్ కోసం దాదాపు 10 లక్షల వరకు నూతన్ నాయుడు ఖర్చు చేసినట్లుగా కొందరు చెబుతున్నారు.అయితే మరి కొందరు మాత్రం అంతకు పది రెట్లు కూడా నూతన్ నాయుడు ఖర్చు చేసి ఉంటాడు అని, ఆయన రాజకీయ నాయకుడిగా మారాలనే ఉద్దేశ్యంతో గుర్తింపు కోసం బిగ్‌బాస్ వెళ్తున్నాడు.రెండు వారాలు ఉంటేనే బిగ్‌బాస్ ద్వారా నూతన్ నాయుడుకు స్టార్‌డం దక్కింది.ఇప్పుడు మరో నాలుగు వారాలు హౌస్‌లో కొనసాగితే ఖచ్చితంగా స్టార్‌డం దక్కే ఛాన్స్ ఉందని, అలా రాజకీయ నాయకుడిని అయిపోవచ్చు అనేది నూతన్ నాయుడు ప్లాన్‌గా సమాచారం అందుతుంది.