రాంసక్కనోడమ్మ చందమామా రాకరాక ఎందుకొచ్చె హయ్యోరామా అంటూ ప్రీతిజింతా.మహేశ్ బాబు ఆడిపాడిన సినిమా రాజకుమారుడు.
వారిద్దరి పేర్లు గుర్తుకు రాగానే మనకు సినిమా పేరు,పాటలు టక్కున గుర్తొస్తాయి.ప్రిన్స్ మహేశ్ ని హీరోగా పరిచయం చేసిన సినిమా,సొట్టబుగ్గల సుందరాంగి ప్రీతిజింతాని తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ సినిమా వచ్చి పంతొమ్మిదేళ్లు… ఈ సంధర్బంగా ప్రీతి చేసిన ఒక ట్వీట్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది.

‘‘రాజకుమారుడు సినిమా విడుదలై అప్పుడే 19 ఏళ్లు అవుతోంది.నమ్మబుద్ధి కావడం లేదు కదూ.మహేష్‌బాబుతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.తెలుగు నేర్చుకోవడం కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపా.
ధన్యవాదాలు రాఘవేంద్రరావుగారు’’ అని తెలిపింది.అనంతరం మహేష్‌బాబుతో షూటింగ్ సమయంలో తీసుకున్న అప్పటి ఫొటోను షేర్ చేసుకుంది.
ఆ ఫోటోలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు సూపర్ స్టార్ కృష్ట, మహేష్‌బాబు, నిర్మాత అశ్వనీదత్, ప్రీతీ ఉన్నారు.

ఆ సినిమా ద్వారా పరిచయం అయిన మహేశ్ ఇప్పుడు టాలివుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు.ఆ సినిమా తర్వాత వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించిన ప్రీతిజింతాని తెలుగు ప్రేక్షకులు ఆదరించినప్పటికి తను బాలివుడ్ కే పరిమితం అయింది.ఏదేమైనప్పటికి ఆ నాటి జ్ణాపకాలను గుర్తు చేస్తూ ప్రీతి ట్వీట్ చేయడం.
ఆ సినిమా వచ్చి అన్నేల్లయిందా అని నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.