ఈ హోం మేడ్ షాంపూను వాడారంటే ఆ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

ప్రస్తుత వర్షాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం ఎంతో కష్టమైన పని.వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షాల ప్రభావం, కాలుష్యం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, డాండ్రఫ్, హెయిర్ డ్యామేజ్ తదితర జుట్టు సంబంధిత సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తూ ఉంటాయి.

 Hair Problems Will Go Away If You Use This Home Made Shampoo ,  Homemade Shampoo-TeluguStop.com

వాటిని నివారించుకోవడం కోసం రకరకాల షాంపూలను మారుస్తుంటారు.

అయితే మార్కెట్లో లభ్యమయ్యే షాంపూల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ.

ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ షాంపూను వాడితే మాత్రం వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.మరి ఆ హోం మేడ్ షాంపూను ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఐదు లేదా ఆరు కుంకుడుకాయలను తీసుకుని గింజలను తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకొని అందులో ఒక పెద్ద శీకాయ‌, గింజ తొలగించిన కుంకుడు కాయలు, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతులు, ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మ‌రో గిన్నెను పెట్టుకుని అందులో నానబెట్టుకున్న శీకాకాయ, కుంకుడుకాయ, మెంతులను వాటర్‌తో సహా వేసుకోవాలి.

Telugu Tips, Dandruff, Dry, Care, Care Tips, Fall, Problems, Shampoo-Telugu Heal

అలాగే అందులో మూడు మందారం పువ్వులను కూడా వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన మిశ్రమాన్ని చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని స్ట్రైన‌ర్‌ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే.

హోం మేడ్ షాంపూ సిద్ధమైనట్టే.ఈ షాంపూ ను వారంలో రెండు సార్లు వినియోగిస్తే.

హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు సైతం ప‌రార్ అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube