ఇంగువ( hing ).దీని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.
దీన్నే హింగ్ లేదా ఆసుఫోటిడా అని కూడా పిలుస్తారు.వంటల్లో ఇంగువను కొందరు విరివిరిగా వాడుతుంటారు.
జీర్ణక్రియ ప్రక్రియ ని సులభతరం చేయడానికి ఇంగువను వినియోగిస్తుంటారు.కానీ ఇంగువతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇంగువతో టీ తయారు చేసుకుని తాగితే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంతకీ ఇంగువ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి.అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), పావు టేబుల్ ధనియాల పొడి( Coriander powder ), కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి మరిగించాలి.
వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేసి ఆపై స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.అంతే మన టీ సిద్ధం అయినట్లే.
ఈ టీను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
ప్రతిరోజు ఈ ఇంగువ టీను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఉబ్బసం( Cold, cough, asthma ) వంటి సమస్యలు దూరం అవుతాయి.ఈ టీలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి.సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.
అలాగే నిత్యం ఈ ఇంగువ టీ తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారికి ఈ ఇంగువ టీ ( hing tea )న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తుంది.ఇంగువ టీ రక్తపోటును అదుపులోకి తెస్తుంది.
అంతేకాదు ఈ ఇంగువ టీను నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగులు నాశనం అవుతాయి.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మలినాలు తొలగిపోతాయి.
ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పరార్ అవుతాయి.బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
మరియు ఈ ఇంగువ టీను తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు.