సూర్యాపేట జిల్లా:బీరులో సీసాల్లో నాచు,బల్లి రావడంతో మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైన్స్ షాపు యజమానిపై ఘర్షణకు దిగిన ఘటన తుంగతుర్తి మండల కేంద్రంలోని వెంకటేశ్వర వైన్ షాపులో బుధవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనపై ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసినా ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అవేదన వ్యక్తం చేశారు.
కనీసం సంఘటన స్థలానికి రాలేకపోయారంటే అధికారులకు,వైన్స్ యాజమాన్యం మధ్య ఎంతటి అవగాహన ఉందో అర్థమవుతుందన్నారు.సంఘటనపై జిల్లా ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి వైన్ షాప్ పై కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.