హీరోల గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.మా వోడు తర్వాత ఏ సినిమా చేస్తున్నాడు? ఏ డైరెక్టర్ తో చేస్తున్నాడు? ప్రెజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? అనే విషయాల్లో ఆతురతగా ఉంటారు.సినిమా పరంగానే కాదు, హీరోకి సంబంధించిన వ్యక్తిగత జీవితం కూడా ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు.హీరో భార్య ఏం చేస్తారు? ఆమె తోబుట్టువుల ఏం చేస్తుంటారు? వంటివి తెలుసుకోవాలనుకుంటారు.కానీ ప్రత్యేకించి ఎవరూ బయటపెట్టరు.చాలా తక్కువ మందికే వీళ్ళ గురించి తెలుస్తుంది.
అయితే ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోల భార్యల తోబుట్టువుల గురించి తెలుసుకుందాం.
రామ్ చరణ్ భార్య ఉపాసన.
ఈమె అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనవరాలు.ప్రతాప్ సి.రెడ్డి కుమార్తె అపోలో గ్రూప్ వైస్ చైర్మన్ అయిన శోభనా కామినేని పెద్ద కుమార్తె ఉపాసన.ఈమె తండ్రి పేరు అనిల్ కామినేని.ఈమెకు ఒక సోదరి, తమ్ముడు ఉన్నారు.ఇద్దరూ విదేశాల్లోనే చదువుకున్నారు.అనుష్పల కామినేని ఉపాసనలానే ఉంటారు.
ఎంబీఏ పూర్తి చేసి ఇండియా వచ్చిన తర్వాత అనుష్పల, అపోలో ఫార్మసీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.అయితే ఒక పక్క బిజినెస్ ను చూసుకుంటూనే, మరోపక్క అక్క ఉపాసనలా ట్రెండ్ కి తగ్గట్టు అప్ డేటెడ్ గా ఉంటారు.

ఇక స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ భార్య స్నేహారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూతురు.ఎంత డబ్బు ఉన్నా గాని వీళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు.స్నేహకి సోదరి కూడా ఉన్నారు.ఆమె పేరు నాగురెడ్డి.ఇద్దరూ విదేశాల్లోనే చదువుకున్నారు.స్నేహరెడ్డి అమెరికాలో బీ.టెక్ (ఈసీఈ) పూర్తి చేశారు.ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి, హైదరాబాద్ వచ్చేశారు.
ఇక్కడ ఆయన తండ్రి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.బన్నితో పెళ్లయ్యాక కూడా కుటుంబాన్ని చూసుకుంటూనే, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఇక ఈమె సోదరి నాగురెడ్డి కూడా ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతున్నారు.హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో “టాప్ స్టిచ్” పేరుతో వ్యాపారం చేస్తున్నారు.
ప్రముఖ డిజైనర్ లు రూపొందించిన దుస్తులను, వస్తువులను ఒక చోట చేర్చి ఫ్యాషన్ ప్రియులకు అందజేసే వ్యాపారం ఆమెది.అంతేకాదు హైదరాబాద్ లో జరిగే ఫ్యాషన్ షోలలో నాగురెడ్డి కంపెనీకి ఎంతోకొంత భగస్వామ్యం ఉంటుంది.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటారు.తెలుగుతనం ఉట్టిపడేలా, తెలుగింటి ఆడపడచులా సాంప్రదాయ మహిళగా కనిపిస్తారు.ఎప్పుడో ఎన్టీఆర్ తో కలిసి ఫంక్షన్లకు వచ్చినప్పుడు తప్పితే అస్సలు బయటకు రారు.స్టార్ హీరో భార్య అయినప్పటికీ, ఏ మాత్రం గర్వం ఉండదు.అణకువ ఆమె సొంతం.ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె మరియు చంద్రబాబునాయుడు మేనకోడలు కూతురు.
ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు.పేరు నార్నే నితిన్ చంద్ర.
హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న నితిన్, ప్రస్తుతం తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు.అయితే ఎన్టీఆర్ నటన అంటే నితిన్ పిచ్చెక్కిపోతారట.
ఎన్టీఆర్ ది ఏ సినిమా రిలీజైనా ఫ్రెండ్స్ తో కలిసి చూస్తారట.ఎన్టీఆర్ అంటే నితిన్ కి చాలా ఇష్టమట.
అంతేకాదు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.ఎన్టీఆర్ తో ఉన్న చనువు, ఎన్టీఆర్ సినిమాల ప్రభావం కారణంగా తాను కూడా సినిమాల్లో నటించాలని చూస్తున్నారట.
ఎన్టీఆరే కాదు, ఎన్టీఆర్ బావమరిది కూడా అందంగా ఉంటారు.మరి ఎన్టీఆర్, బావమరిదిని తన సినిమాల ద్వారా పరిచయం చేస్తారేమో చూడాలి.