చాలా మందిలో హెయిర్ గ్రోత్( Hair growth ) అనేది తక్కువగా ఉంటుంది.కొందరిలో అయితే అస్సలు ఉండదు.
ఇలాంటి వారి జుట్టు రోజు రోజుకు పల్చగా మారుతుంటుంది.దీంతో తెగ హైరానా పడిపోతుంటారు.
అయితే మీకు ఉల్లి, వెల్లుల్లి చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉల్లి, వెల్లుల్లిని వాడితే మీ జుట్టు వద్దన్నా ఒత్తుగా పెరుగుతుంది.
అందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయ( Onion ) తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు( Garlic cloves )తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ గ్రోత్ టోనర్ సిద్ధమవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే మీ జుట్టు వద్దన్నా ఒత్తుగా పెరుగుతుంది.ఈ టోనర్ హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడానికి చాలా గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
వారానికి రెండు సార్లు ఈ టోనర్ ను వాడితే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.మరియు చుండ్రు సమస్య ( Dandruff problem )సైతం దూరం అవుతుంది.