ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు ఎక్కువగా దానధర్మాలు చేస్తున్నారు.ఎందుకంటే పుట్టినప్పుడు ఏమి తీసుకోరానివాడు పోయాక ఏమి తీసుకుపోతాడు.
అనే విషయాన్ని జనాలు బాగా అర్థం చేసుకున్నారు.ఇంకా చెప్పాలంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వారి దగ్గర ఉన్న దాంట్లో కొంత లేని వారికి ఇవ్వడంలో ఉన్న ఆనందం వేరుగా ఉంటుంది.
అంతే కాకుండా ఇంకొంత మంది దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని కూడా దానం చేస్తూ ఉంటారు.
ఇలా దానం చేయడం వల్ల లేనివాడు మనం చేసిన దానంతో ఒక పూట అన్నం తిన్న మనకు పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు.
అలాగే రాహు, కేతు, శని వంటి గ్రహాల ప్రభావం తగ్గించడంలో కూడా దానధర్మాలు ఎంతగానో ఉపయోగపడతాయి.అయితే కొంత మంది దానం చేసేటప్పుడు ధనానికి బదులు ఈ వస్తువులను దానం చేసినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారు.
అలా దానం చేసే వస్తువులలో నల్ల దుప్పటి దానం చేయడం వల్ల శని ఆగ్రహాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.అంతే కాకుండా శని అనుగ్రహం కూడా ఆ ఇంటి కుటుంబ సభ్యులపై ఉంటుంది.ఇంట్లో మనమే స్వయంగా వంట చేసిన ఆహారాన్ని దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే పండ్లు కూడా దానం చేయవచ్చు.
ఇంకా చెప్పాలంటే బుధవారం రోజు ఆకుపచ్చ పండ్లు దానం చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది.రాహు, కేతు ఒంటి గ్రహాలను శాంతింప చేయడంలో దుస్తులు ఎంతగానో ఉపయోగపడతాయి.ఎందుకంటే ఈ రెండు గ్రహాలు మనశ్శాంతి, కర్మలతో సంబంధం కలిగి ఉంటాయి.
కాబట్టి దుస్తులను దానం చేస్తే మనశ్శాంతి లభిస్తుందని చాలామంది చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సోమవారం రోజు పాలు దానం చేయడం వల్ల మనసులోని భయం, గందరగోళం దూరం అవుతాయని చాలామంది వేద పండితులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU