బ్రహ్మకు పూజలు ఎందుకుండవో తెలుసా?

పురాణాల గురించి తెలిసిన చాలా మంది ఆవు ముఖాన్ని చూడకూడదు అని చెబుతుంటారు. అలా ఎందుకు చెబుతారో తెలుసుకుందాం… శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మ దేవుడూ, చివరి భాగాన్ని శ్రీ మహా విష్ణువు చూసి రావాలని ఒకసారి పందెం వేసుకున్నారట.

 What Is The Reason Behind Brahmado Not Have Any Puja, Brahma , Pooja , Devotiona-TeluguStop.com

 దేవతల సాక్షిగా ఇద్దరూ బయలు దేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్లినా శివలింగం ముందు భాగం కనిపించలేదు.

 విష్ణువుకు చివరి భాగం కనిపించలేదు . కానీ బ్రహ్మ దేవుడికి మార్గం మధ్యలో దేవ లోకపు గోవూ, మొగలి చెట్టూ కన్పించాయి.

 బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్లు దేవతలకి సాక్ష్యం చెప్పమంటాడు. బ్రహ్మ దేవుడు అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్లి బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశారని సాక్ష్యం చెబుతాయి.

 దేవతలు నిజమని నమ్మి బ్రహ్మ దేవుడినే విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీ మహా విష్ణువు వస్తాడు.

అదే సమయంలో ఆకాశవాణి దేవ లోకపు గోవూ, మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని తెలియజేస్తాయి. దానితో అసత్యాన్ని పలికిన బ్రహ్మకి కలియుగంలో పూజలు ఉండవని… అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వు పూజకి పనికి రాదని… గోవు ముఖం చూస్తే.

 దోషమని శాపం విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మ దేవుడికి ఎక్కడా గుడి లేదు.పూజలు లేవూ.
Telugu Aavu, Brahma, Devotional, Gomatha-Telugu Bhakthi

మొగలి పువ్వును ఏ దేవుడి పూజకు వాడరు. అలాగే గోమాతలో సకల దేవతలు ఉంటారని చెబుతారే తప్ప.మొఖాన్ని మాత్రం సరిగ్గా చూడరు.

 అందుకే అబద్ధాలు చెప్పేముందు ఒక సారి ఆలోచించాలి.మనం చేసేది తప్పో, సరైనదో ఓ అంచనాకి వచ్చాకే నిర్ణయాలు తీసుకోవాలి.

లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube