అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళ్తే అమెరికాలో కరోనా మహమ్మారి అత్యంత వేగంగా మళ్లీ విజృంభిస్తుండడంతో కేసుల సంఖ్య తోపాటు మరణాల సంఖ్య పెరగటంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది.
ఇటువంటి తరుణంలో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన డోనాల్డ్ ట్రంప్.తమ ప్రభుత్వం ఉన్న సమయంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరిగిందని అందువల్లే అప్పట్లో మరణాల సంఖ్య తగ్గించ కలిగినట్లు చెప్పారు.
తాను అధికారంలో ఉన్న సమయంలో 200 మిలియన్ డోస్ లు ఫైజర్, 200 మిలియన్ డోస్ లు మోడర్నా వాక్సిన్ లు ముందుగాన్నే ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
సకాలంలో ప్రజలకు ఆ టైంలో వ్యాక్సిన్ అందించడం వల్ల మరణాల సంఖ్య పెరగకుండా చూసుకునమని ఏ మాత్రం టైం ఆలస్యం అయినా… 10 కోట్ల మంది అమెరికాన్లు ప్రాణాలు కోల్పోయే వాళ్ళని స్పష్టం చేశారు.
డోనాల్డ్ ట్రంప్ మొదటినుండి ఈ మహమ్మారి కరోనా చైనా ల్యాబ్ నుండి ప్రపంచం లోకి వచ్చినట్లు చెబుతూ వచ్చారు.అంతేకాకుండా చైనా వైరస్ ని కూడా మొదటి నుండి ట్రంప్ పిలవడం జరిగింది.
అయితే ఇటీవల… కొన్ని దేశాలు చేసిన ప్రయోగాలల చైనా ల్యాబ్ నుండి ఈ వైరస్ లీక్ అయినట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం.