మానవ జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పని ఒత్తిడి మరియు పలు ఇతర కారణాల వల్ల కొంతమంది శృంగారానికి పెద్దగా సమయాన్ని కేటాయించ లేకపోతున్నారు.
అంతేకాక మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదించలేక పోతున్నారు. దీంతో పలు మానసిక రుగ్మతలకు గురవడమే కాకుండా, తమ దాంపత్య జీవితాన్ని సరిగా లీడ్ చేయలేకపోతున్నారు.
ఆ మధ్య ఓ ప్రముఖ సర్వే సంస్థ నిర్వహించిన “ఏయే దేశస్తులు శృంగారం కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారనే విషయంపై సర్వే” నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇందులో భాగంగా భారతదేశంలో కొంతమంది వారానికి ఒక్కసారి కూడా సంతృప్తిగా శృంగారంలో పాల్గొనడం లేదని తేలింది.
ఈ కారణం వల్లే కొంతమంది వివాహిత మహిళలు వివాహేతర సంబంధాలపై మొగ్గు చూపుతున్నారట.మరికొందరైతే వయసులో ఉన్నప్పుడు లక్ష్యంపై దృష్టి సారించడంతో శృంగారానికి పెద్దగా సమయం కేటాయించడం లేదని కానీ లక్ష్యం సాధించిన తర్వాత డబ్బులు వెచ్చించి మరీ శృంగార జీవితాన్ని అనుభవిస్తున్నారని కూడా ఈ సర్వేలో తేలిందట.
ఇక సగటున భారతీయులు వారానికి 20 లేదా 35 నిముషాలు శృంగారం చేయడానికి కేటాయిస్తున్నారట. దీంతో కొంతమంది డాక్టర్లు ఈ విషయంపై స్పందిస్తూ శృంగారం అనేది మానవ జీవితంలో ఎంతో ముఖ్యమని కాబట్టి పెళ్లయిన భార్య భర్తలు వారానికి రెండు లేదా మూడు సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల తమ దాంపత్య జీవితం చాలా బాగుంటుందని అంతేకాక మానసికంగా కూడా కొంతమేర మెరుగ్గా ఉంటారని సూచిస్తున్నారు.
ఇక అత్యధికంగా బ్రెజిల్ దేశస్తులు వారానికి ఒకటి నుంచి మూడు సార్లు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటారని అది కూడా దాదాపుగా శృంగారంలో పాల్గొన్న ప్రతీసారీ 25 నుంచి 30 నిమిషాలు సమయం ఖచ్చితంగా శృంగారానికి కేటాయిస్తారని సర్వేలో వెల్లడైంది.ఆ తర్వాత స్థానంలో జపాన్, అమెరికా, బ్రిటన్, తదితర దేశాలు ఉన్నాయి.