సాహసప్రియులు, థ్రిల్ కోరుకునే వారు ఎక్కువగా దుబాయ్ ను సందర్శిస్తుంటారు.ఎందుకంటే అక్కడ ఎన్నో ఆశ్చర్యకరమైన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, పర్యాటకులను ఉత్తేజపరిచే ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఉంటాయి.
ముఖ్యంగా ఆకాశం లో నుంచి కిందికి అమాంతంగా దూకే స్కై డైవింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.అంతేకాకుండా ఇసుకలో వాహనాలను నడుపుతూ ముందుకు సాగడం, ఎయిర్ బెలూన్లపై విహరించడం కూడా ఇక్కడి ప్రత్యేకతలు.
కళ్లు చెదిరే ఆకాశ హర్మ్యాలు, సముద్ర తీరంలో అందమైన భవంతులు ఈ దేశాన్ని మరింత అందంగా మార్చాయి.
ఇక్కడ ఉన్న పెట్రోల్‌తో పాటు ఎక్కువగా పర్యాటకంపై ఆ దేశం ఆధారపడుతోంది.దీంతో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.తాజాగా రాక్ క్లైంబింగ్ చేసే వారిని మరింత ఉత్తేజితం చేసేందుకు సరికొత్త హోటళ్లను దుబాయ్ నిర్మించనుంది.
రెండు పర్వాతాల మధ్య ఆకాశంలో వేలాడుతూ ఉండే హోటళ్లు పర్యాటకులకు సరికొత్త అనభూతిని పంచనున్నాయి.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రెండు పర్వతాల మధ్య గుడారాలు ఆకాశంలో వేలాడడం అనేది ఊహకు అందని విషయం.దీనిని దుబాయ్ సుసాధ్యం చేసింది.ఆ దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ అర్ద్ ఈ విభిన్న శైలిలోని నిర్మాణాలను చేపడుతోంది.దీనికి ది ఫ్లోటింగ్ రిట్రీట్ అనే పేరు పెట్టింది.
షార్జాలోని పర్వతాల మధ్య దీనిని త్వరలో నిర్మించనున్నారు.ఒక్కో గుడారంలో ఇద్దరు మాత్రమే ఉండగలిగేలా దీని నిర్మాణాలు చేపట్టారు.
పర్వతాలపై చాలా ఎక్కువగా గాలి వీస్తుంది.వీటిని తట్టుకుని ఉండేలా నిర్మాణాలను చేపట్టారు.
ఏ ప్రమాదం వచ్చినా వెంటనే కాపాడడానికి సిబ్బంది రెడీగా ఉంటారు.అగ్నిమాపక సిబ్బంది, ఇంజినీర్లు, హోటల్ ఉద్యోగులు అంతా పర్యాటకుల కోసం అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు.
ఈ హోటల్‌లో పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి.స్పా, రెస్టారెంట్ వంటివి అందుబాటులో ఉంచారు.