శారీరక వైకల్యాన్ని అధిగమిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధించిన పారా అథ్లెట్లను స్పూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్యా మెహతా ఫౌండేషన్ (ఏఎమ్ఎఫ్) ఆధ్వర్యంలో పలు చాంపియన్షిప్స్ పతకాలు సాధించిన 10 మంది పారా అథ్లెట్లకు రూ.8 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… శరీరంలోని అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే తమలోని శక్తిని గుర్తించకుండా కాలక్షేపం చేస్తున్నారని, పారా అథ్లె ట్లను స్ఫూర్తిగా తీసుకుని యువత జీవితంలో ఏదైనా సాధించాలని సూచిం చారు.
కార్యక్రమంలో హీరోయిన్ రెజీనా, మంచులక్ష్మి, ఏఎమ్ఎఫ్ ట్రస్టీ ఎస్.జోషి, కే.దుర్గాప్రసాద్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.