మహేష్ బాబుపై కన్నేసిన కేజీఎఫ్ బ్యూటీ.. ఆయన సినిమానే చివరిగా చూశానంటూ?

శ్రీనిధి శెట్టి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.

 Srinidhi Shetty About Kgf Movie And Future Plans Special Interview Srinidhi Shet-TeluguStop.com

కదా ఈ సినిమాలో హీరో యష్ సరసన నటించింది శ్రీనిధి.ఈ సినిమాలో ఆమె నటన గాను మంచి మార్కులే పడ్డాయి.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు అని అడగగా.నేను మిస్ దివా ఇండియా పోటిల్లో కిరీటం గెలుచుకున్న తరువాత అందుకు సంబందించిన ఫోటోలు అనేక పత్రికల్లో రావడంతో ఆ ఫోటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంతి నిన్న ఆడిషన్స్ కు పిలిచారు.

నా ఆడిషన్స్ లో నా పర్ఫామెన్స్ వచ్చి నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు అని తెలిపింది శ్రీనిధి శెట్టి.అనంతరం కేజిఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా అని అడగగా.

అసలు అనుకోలేదు.సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేదు.

Telugu Kgf, Srinidhi Shetty-Movie

కానీ ఈ సినిమా విడుదలైన తర్వాతే తెలిసింది మేము ఎంత పెద్ద హిట్ సాధించాము తెలిపింది శ్రీనిధి.మీరు తెలుగు సినిమాలో చూస్తారా? ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ తెలుగు సినిమాలు చూశారు అని అడగగా.అవును నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను.నిజానికి నేను సినిమా పిచ్చిదాన్ని.అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను.తెలుగులో నేను చూసిన చివరి సినిమా సర్కారు వారి పాట అని తెలిపింది శ్రీనిధి శెట్టి.

తదుపరి సినిమాల గురించి ప్రశ్నించగా.చాలా ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి.

ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టు ఇంకా ఓకే కాలేదు అని తెలిపింది శ్రీనిధి శెట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube