బ‌త‌కాలంటే ఇలాంటి తెగువే ఉండాలి.. పాము నుంచి ఎలుక ఎలా త‌ప్పించుకుందో చూస్తే

బ‌త‌కాలంటే తెగింపు ఉండాలి.ఎలాంటి ప్ర‌మాదాల్లో అయినా స‌రే బ‌త‌కాలనే తాప‌త్ర‌యం ఉండాలి.

 To Live Must Have Such Courage Look At How The Rat Escaped From The Snake Detail-TeluguStop.com

లేక‌పోతే ఆ క్ష‌ణ‌మే మ‌న ప్రాణాలు ఆగిపోతాయి.అయితే ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో కూడా అత్యంత ఆత్మ విశ్వాసంతో ఉంటేనే బ‌య‌ట‌ప‌డుతాం.

ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న‌కు అడ‌విలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.ఎందుకంటే అడ‌విలో ఏ క్ష‌ణంలో ఏ జంతువు మీద దాడి జ‌రుగుతుందో ఎవరము చెప్ప‌లేం.

అలా వేట సంద‌ర్భంలో వేటాడే జీవికి చిక్కినా కూడా.కొన్ని జంతువులు బ‌తికి బ‌య‌ట‌ప‌డు తుంటాయి.

వాటికి ఉన్న బ‌త‌కాల‌నే కోరిక‌, గెలుస్తామ‌నే ఆత్మ విశ్వాస‌మే వాటిని ప్ర‌మాదాల నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది.మ‌ర‌ణం అంచుల దాకా వెళ్లినా స‌రే బ‌తికి బ‌య‌ట ప‌డొచ్చు.

ఇప్పుడు కూడా ఓ ఎలుక ఇలాగే అత్యంత భ‌యంక‌ర‌మైన పాము నుంచి పోరాడి తన‌ ప్రాణాల‌ను కాపాడుకుంది.ఏదో ఆహారం కోసం బ‌య‌ట‌కు వెళ్లిన ఎలుక‌ను.అటు వైపుగా వ‌చ్చిన ఓ పాము అమాంతం మింగేసేందుకు వ‌చ్చింది.అయితే పామును గ‌మ‌నించ‌ని ఆ ఎలుక దానికి ద‌గ్గ‌ర‌గా వెళ్లిపోయింది.

ఇక పాము కూడా కొంచెం ఓపిగ్గా త‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే దాకా చూస్తూ ఉంది.

కాగా ద‌గ్గ‌ర దాకా వెళ్లిన త‌ర్వాత ఆ పామును ఎలుక గుర్తించింది.దాంతో ఆ పాముకు చిక్క‌కుండా పారిపోవ‌డం స్టార్ట్ చేసింది.అయితే పాము కూడా చాలా స్పీడుగా ప‌రిగెత్త‌డం స్టార్ట్ చేసింది.

కాగా ఆ ఎలుక త‌న ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికి త‌న శ‌క్తినంతా కూడ‌గ‌ట్టుకుని మ‌రీ ప‌రుగులు తీయ‌డం స్టార్ట్ చేసింది.చివ‌ర‌కు త‌న ప్రాణాల‌ను కాపాడుకుంది.అయితే ఇదంతా కూడా అక్క‌డున్న కెమెరాల్లో రికార్డు అయింది.ఇది కాస్తా నెట్టింట్లో షేర్ చేయ‌గా.

విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.చాలామంది ఆ ఎలుక ప్ర‌య‌త్నాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube