ప్రభాస్ మాట ఇస్తే ఇలా కూడా చేస్తాడా..?

ఏరంగంలోనైనా రాణించాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు.కాస్త అదృష్టం కూడా జత కలవాలి.

 Hero Prabhas Support Upcoming Actor Sobhan, Sobhan, Varsham Movie Director, Sant-TeluguStop.com

అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలో అయితే ఈ ఫార్ములా మరీ ఎక్కువగా ఉంటుంది.

ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పడం కష్టం.గతంలో ఏ సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి.

అద్భుతా సాధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు.కానీ ఇప్పుడు యాక్టింగ్ వచ్చినంత మాత్రాన.

ఏ సపోర్టు లేకుండా ముందుకు సాగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.కానీ ప్రస్తుతం చక్కటి టాలెంట్ ఉన్న ఓ యువ నటుడికి ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ యాక్టర్ తోడయ్యాడు.

ఇంతకీ వారెవరో కాదు.టాలెంటెడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కాగా.

అతడికి సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియన్ హీరో ప్రభాస్.ఇంతకీ ప్రభాస్ తనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ మూవీ వర్షం.ఈ సినిమా దర్శకుడు శోభన్.ప్రభాస్ కెరీర్ కు మంచి ట్రాక్ వేయడంలో ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది.అందుకే శోభన్ అంటే ప్రభాస్ కు ఎంతో గౌరవం.

ప్రస్తుతం ప్రభాస్ సపోర్ట్ చేస్తున్న సంతోష్ శోభన్. శోభన్ కుమారుడు.

శోభన్ తక్కువ సమయంలోనే రచయితగా.దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

వర్షం, బాబీ, చంటి సినిమాలతో అదరగొట్టాడు.ఒకరాజు ఒకరాణి సినిమాలో నటించాడు.

మురారి సినిమాకు డైలాగులు రాశాడు.అంతేకాదు.

ఒకప్పుడు వెలుగు వెలిగిన కమెడియన్ లక్ష్మీపతికి శోభన్ అన్నయ్య అవుతాడు.

Telugu Ek Katha, Prabhassantosh, Prem Kumar, Santosh Shoban, Sobhan, Tollywood,

అయితే 2008లో శోభన్ హార్ట్ స్ట్రోక్ తో కన్నుమూశాడు.కొద్ది రోజుల తర్వాతే లక్ష్మీపతి కూడా చనిపోయాడు.అటు చిన్నప్పటి నుంచే శోభన్ కొడుకు సంతోష్ శోభనకు నటన పట్ల చాలా ఆసక్తి ఉండేది.

అందుకు సుమంత్ హీరోగా చేసిన గోల్కొండ హైస్కూల్ లో సంతోష్ కూడా కీ రోల్ పోషించాడు.అటు తను నేను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.పేపర్ బాయ్ సినిమాతో టాలెంటెడ్ యంగ్ హీరోగా గుర్తింపు పొందాడు.

Telugu Ek Katha, Prabhassantosh, Prem Kumar, Santosh Shoban, Sobhan, Tollywood,

సంతోష్ శోభన్ కు పలువురు హీరోలు, దర్శకులు మద్దతు ప్రకటించారు.ఆయన సినిమాలకు ప్రమోట్ చేశారు.తన తండ్రితో వారికి ఉన్న అనుబంధం కారణంగానే తనను వెన్నుతట్టి ప్రోత్సహించారు.

అటు ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వచ్చిన ఏక్ మినీ కథతో సంతోష్ అదరగొట్టాడు.ప్రస్తుతం సంతోష్ పలు కీలక ప్రాజెక్టులు చేస్తున్నాడు.మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి, అభిషేక్ మహర్షి దర్శకత్వంలో ప్రేమ్ కుమార్, చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్ బాబు, నందిని రెడ్డి దర్శకత్వంలో ఇక నీకు.అన్నీ మంచి శకునములే అనే సినిమాలు చేస్తున్నాడు.

అటు ఆహా, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ది బేకర్ ది బ్యూటీ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube