మనం చేసే పొరపాట్లే జీవితాను ప్రమాదంలోకి నెట్టేస్తాయి.ఇక రోడ్డు మీద జరిగే ప్రమాదాలను చూస్తే మాత్రం చిన్న పొరపాట్లే కారణంగా కనిపిస్తాయి.
చాలా మనం చేసే తొందరపాటు పనుల వల్ల అవి కాస్తా చివరకు మన ప్రాణాలమీదికి తెస్తుంది.ఇక ఇప్ఉఏపడు కూడా ఇలాంటి వీడియో గురించే మనం మాట్లాడుకోబోయేది.
ఇది చూసిన తర్వాత అసలు ఇలా ఎలా చేస్తారంటూ అంతా షాక్ అవుతున్నారు.ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం ఇంత తొందరపాటేంటని అంతా కామెంట్లు కూడా చేస్తున్నారు.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చూసే వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఇక ఈ వీడియోను ఓ రైల్వేగేటు దగ్గర తీసిందిగా తెలుస్తోంది.అయితే ఈ వీడయోలో ఒక వ్యక్తి ఎంతో హడావిడిగా రైల్వే గేటు దాటడానికి స్పీడ్ గా వస్తుండటంతో చివరకు ఆయన ప్రమాదంలో పడ్డారు.
ఆయన కంటే ముందుగా వచ్చిన ఒక కారు, ఇద్దరు బైకులు రైల్వే గేట్ మూసివేసేలోపు దాన్ని విజయవంతంగా దాటేసారు.కానీ వారి తర్వాత అత్యంత వేగంతో వస్తున్న బైకర్ మాత్రం పొరపాటు చేస్తూ వచ్చి ఎలాగైనా గేటు పడేలోపు దాన్ని దాటేయడానికి చూశాడు.
ఆయన రాగానే గేటు సడెన్ పడేసరికి చివరకు ఆయన గేటును ఢీకొట్టాడు.ఇంకేముంది వెంటనే ఆయన కింద పడిపోయాడు.కానీ పెద్దగా దెబ్బలు తగలకపోవడంతో ఆయన వెంటనే లేస్తాడు.ఇక బైకును ఏమైనా దెబ్బలు తాకాయో లేదో అని చూసకున్నాడు.ఇక తాను పైకి లేచి అంతా సర్దుకుని తన ప్రయాణం కోసం వేచి చూస్తున్నాడు.అయితే ఇందులో నీతి ఏంటంటే ఇలాంటి రైల్వే గేట్ల వద్ద ఎలాంటి స్పీడు పనికి రాదు.
కాగా ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.మరి మీరు కూడా కామెంట్ చేయండి.