బ్రహ్మకు పూజలు ఎందుకుండవో తెలుసా?

బ్రహ్మకు పూజలు ఎందుకుండవో తెలుసా?

పురాణాల గురించి తెలిసిన చాలా మంది ఆవు ముఖాన్ని చూడకూడదు అని చెబుతుంటారు.

బ్రహ్మకు పూజలు ఎందుకుండవో తెలుసా?

 అలా ఎందుకు చెబుతారో తెలుసుకుందాం. శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మ దేవుడూ, చివరి భాగాన్ని శ్రీ మహా విష్ణువు చూసి రావాలని ఒకసారి పందెం వేసుకున్నారట.

బ్రహ్మకు పూజలు ఎందుకుండవో తెలుసా?

 దేవతల సాక్షిగా ఇద్దరూ బయలు దేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్లినా శివలింగం ముందు భాగం కనిపించలేదు.

 విష్ణువుకు చివరి భాగం కనిపించలేదు . కానీ బ్రహ్మ దేవుడికి మార్గం మధ్యలో దేవ లోకపు గోవూ, మొగలి చెట్టూ కన్పించాయి.

 బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్లు దేవతలకి సాక్ష్యం చెప్పమంటాడు.

 బ్రహ్మ దేవుడు అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్లి బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశారని సాక్ష్యం చెబుతాయి.

 దేవతలు నిజమని నమ్మి బ్రహ్మ దేవుడినే విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీ మహా విష్ణువు వస్తాడు.

అదే సమయంలో ఆకాశవాణి దేవ లోకపు గోవూ, మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని తెలియజేస్తాయి.

 దానితో అసత్యాన్ని పలికిన బ్రహ్మకి కలియుగంలో పూజలు ఉండవని.అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వు పూజకి పనికి రాదని.

 గోవు ముఖం చూస్తే. దోషమని శాపం విధించారు.

 అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మ దేవుడికి ఎక్కడా గుడి లేదు.పూజలు లేవూ.

/br """/"/ మొగలి పువ్వును ఏ దేవుడి పూజకు వాడరు. అలాగే గోమాతలో సకల దేవతలు ఉంటారని చెబుతారే తప్ప.

మొఖాన్ని మాత్రం సరిగ్గా చూడరు. అందుకే అబద్ధాలు చెప్పేముందు ఒక సారి ఆలోచించాలి.

మనం చేసేది తప్పో, సరైనదో ఓ అంచనాకి వచ్చాకే నిర్ణయాలు తీసుకోవాలి.లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.

అబ్బా ఏమి ఫిల్ ఉంది మామ.. సంజీవ్ గోయెంకా దిమ్మ తిరిగేలా షాకిచ్చిన కేఎల్ రాహుల్..!