చేసింది తక్కువ సినిమాలే అయినా వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది రష్మిక మందన్న.ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
మరికొన్ని స్టార్ హీరోల సినిమాల్లో సైతం రష్మికనే ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.రష్మికకు బాలీవుడ్ నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే రష్మిక తన వ్యాయామానికి సంబంధించిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు.తాజాగా రష్మిక తన ఫిట్ నెస్ కు సంబంధించిన సీక్రెట్లను చెప్పగా మెగా కోడలు ఉపాసన తన యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియోను పోస్ట్ చేశారు.
ఫిట్ నెస్ మంత్రాస్ ఆఫ్ రష్మిక మందన్న పేరుతో విడుదలైన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రష్మిక సెలవు రోజుల్లో, పండగ రోజుల్లో కూడా తాను కచ్చితంగా వ్యాయామం చేస్తానని తెలిపారు.వయస్సు ఎంత పెరిగినా వ్యాయామాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తానని వెల్లడించారు. వయస్సు పెరిగినా మంచి ఫిజిక్ ఉండే విధంగా జాగ్రత్త పడతానని చెప్పడంతో పాటు తనకు ఎలాంటి వ్యాయామాలు అంటే ఎక్కువ ఇష్టమో వెల్లడించారు.
వ్యాయామానికి సంబంధించి అనేక కీలక విషయాలను రష్మిక వీడియోలో తెలిపారు.
రష్మిక జిమ్ లో మాత్రమే కాక అప్పుడప్పుడూ బీచ్ లలో కూడా వ్యాయామాలు చేస్తారు.కొత్త ప్రదేశాల్లో ఎక్కడ వర్కౌట్లు చేసినా ఆ వీడియోలను రష్మిక అభిమానులతో పంచుకుంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 స్థానం కోసం కష్టపడుతున్న రష్మిక మరో రెండు విజయాలు తన ఖాతాలో వేసుకుంటే మాత్రం నంబర్ 1 హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.