వయసు పైబడే కొద్ది ముఖంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.ముఖ్యంగా ముడతలు ( Wrinkles )కొట్టొచ్చినట్లు కనపడతాయి.
అయితే కొంతమంది మాత్రం 50లోనూ చాలా యవ్వనంగా మెరిసిపోతూ కనిపిస్తుంటారు.అలాంటి వారిని చూస్తే కాస్త అసూయ కలగడం సహజం.
కానీ అటువంటి చర్మాన్ని మీరు పొందవచ్చు.అది కూడా మూడు స్పూన్ల బియ్యంతో.
అవును మరి ఇంతకీ బియ్యంతో ముడతల్లేని మెరిసే చర్మాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు పాలు ( Milk )పోసుకోవాలి.పాలు కాస్త హీట్ అవ్వగానే మూడు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి ఉడికించాలి.దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే పాలు అంత దగ్గర పడతాయి.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార బెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పల్చటి వస్త్రంలో వేసి స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ రైస్ క్రీమ్ లో ఒక గుడ్డు పచ్చ సోన, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,( Olive Oil ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వే( Vitamin E Oil )సుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే వయసు పైబడిన ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఒకవేళ ముడతలు ఆల్రెడీ ఉంటే క్రమంగా మాయం అవుతాయి.
మీ స్కిన్ టైట్ గా బ్రైట్ గా మారుతుంది.కాబట్టి ముడతల్లేని మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.