ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ మేరకు విశాఖ, అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం జగన్ పర్యటన కొనసాగనుండగా ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.ముందుగా విశాఖలోని ఐటీ హిల్ నంబర్-2 లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తరువాత పరవాడకు వెళ్లనున్న ఆయన ఫార్మాసిటీలో గల యుజియా స్టెర్లీ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభిస్తారు.అచ్యుతాపురం సెజ్ లో ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం జగన్ లారెస్ట్ ల్యాబ్ యూనిట్ -2 ను ప్రారంభిస్తారు.
అనంతరం తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు.







