1.ఆస్ట్రేలియాలో అవదానార్చన
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో డిసెంబర్ 3న ‘ తటవర్తి గురుకులం ఆధ్వర్యంలో అవదానార్చన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.
2.ఒమన్ లో ఇంజినీర్ల వర్క్ పర్మిట్లకు కొత్త రూల్స్
గల్ఫ్ దేశం ఒమన్ ఇంజినీర్ల వర్క్ పర్మిట్ల జారీ , పునరుద్దరణకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది.ఈ మేరకు ఆ దేశ కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది.
3.వలసదార్లను పెట్టుకున్న ప్రెంచ్
బ్రిటన్ కు సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తరలివెళ్తున్న 61 మంది వలసదార్లను ప్రెంచ్ అధికారులు పట్టుకున్నారు.
4.జీ -20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుగాంచిన జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.
5.భారత్ లో 44,611 ట్విట్టర్ ఖాతాల పై నిషేదం
భారత దేశంలో పిల్లల లైంగిక దోపిడీ, ఏకాభిప్రాయం లేని నగ్నత్వాన్ని ప్రోత్సహించే 44,611 ట్విట్టర్ ఖాతాలను నిషేధించింది.
6.భారత్ లో వాట్సాప్ సంచలనం
యుజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు, వాట్సాప్ పాలసీ నిబంధనలు ముల్లంగించిన 23 లక్షల భారత ఖాతాలను అక్టోబర్ లో వాట్సాప్ తొలగించింది.తాజాగా వాట్సాప్ ఈ విషయాన్ని ప్రకటించింది.
7.అనుకోకుండా పాకిస్థాన్ చేరుకున్న భారత్ జవాన్
భారత్కు చెందిన బిఎస్ఎఫ్ జవాన్ అనుకోకుండా భూభాగంలోకి వెళ్లారు.దీంతో పాక్ రేంజర్లు ఆయనను అరెస్ట్ చేశారు.దీంతో రేంజర్ లతో బిఎస్ఎఫ్ అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జవాన్ ను విడుదల చేయాలని కోరగా, మొదటగా విముక్తత వ్యక్తం చేసిన తరువాత విడుదల చేసినందుకు అంగీకరించారు.
8.చైనా పై అమెరికా విదేశాంగ మంత్రి కామెంట్స్
చైనా కదలికలపై అమెరికా సహా నాటో సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి అని, చైనా అనుసరిస్తున్న విధానాలు కలవరపెడుతున్నాయి అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంతోనీ బ్లింకెన్ అన్నారు.
9.భారత్ అమెరికా మిలటరీ డ్రిల్స్ పై చైనా ఆగ్రహం
భారత్ అమెరికా మిలటరీ డ్రిల్స్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది
10.సౌదీలో టిడిపి ఆత్మీయ సమ్మేళనం