1.ములుగు ఏజెన్సీ లో డీజీపీ పర్యటన
తెలంగాణ లోని ములుగు ఏజెన్సీ లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు
2.బండి సంజయ్ కామెంట్స్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు నచ్చక ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
3.45 శాతం ఫిట్మెంట్ ఇవ్వండి : విద్యుత్ ఉద్యోగులు
విద్యుత్ ఉద్యోగులకు 39 నుంచి 45 శాతం దాక ఫిట్మెంట్ ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాలు కోరాయి.
4.23 వేల మందికి ఐసెట్ సీట్ల కేటాయింపు
ఐసెట్ మొదటి దశ కౌన్సిలింగ్ లో భాగంగా 23 వేల మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.
5.డిప్యూటీ సోలిసిటర్ జనరల్ గా ప్రవీణ్ కుమార్
తెలంగాణ హైకోర్టులు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రాథమిక వహించే డిప్యూటీ సోలీ సెటర్ జనరల్ గా న్యాయవాది గాడి ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
6.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి ఐఎస్ఓ గుర్తుంపు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా మూడు ఐఎస్ఓ సర్టిఫికెట్లను దక్కించుకుంది.
7.తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రం సమీక్ష
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న 12 ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది .వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి చర్చించారు.
8.టీఎన్జీవో నేత ముజీబ్ కు’ సేవా భూషణ్ ‘
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బిరుదును తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ప్రధానం చేశారు.
9.యాదగిరిగుట్టలో నూతన వ్రత మండపం ప్రారంభం
యాదగిరి కొండ దిగున నూతనంగా నిర్మించిన సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని ఈనెల 26న ప్రారంభిస్తామని దేవస్థానం గీతారెడ్డి తెలిపారు.
10.22 నుంచి ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను 22వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
11.కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్న ప్రకారం మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.
12.పాక్షిక సూర్యగ్రహణం
25న పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతోంది.యూరప్ పశ్చిమ ఆసియా ఈశాన్య ఆఫ్రికాలో ఈ అద్భుతం కనువిందు చేయబోతుంది.
13.ఏపీ సీఎస్ కు అస్వస్థత
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు .ఇటీవల ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై విజయవాడలోని స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అయితే వైద్యుల సూచనలు మేరకు ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
14.బిజెపికి తెలంగాణ మంత్రి వార్నింగ్
చిల్లర రాజకీయాలు చేయవద్దంటూ బిజెపిని ఉద్దేశించి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.
15.ఏపీకి ఏకైక రాజధాని అమరావతే : రాహుల్ గాంధీ
ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు.భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం ఏపీలో రాహుల్ పర్యటిస్తున్నారు.
16.బిజెపిలో చేరిన బూర నర్సయ్య గౌడ్
భువనగిరి మాజీ ఎంపీ, టిఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ ఈ రోజు బీజేపీ లో చేరారు.
17.భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఈరోజు ఏపీలోని ఆదోని మండలం చాగీ గ్రామం నుంచి ప్రారంభమైంది.
18.నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
19.అమరావతి మహా పాదయాత్ర
అమరావతిని మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంచాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఈరోజు రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుంచి ప్రారంభమైంది.
20.గన్నవరం ఎమ్మెల్యే వంశీకి హైకోర్టు నోటీసులు
గన్నవరం టిడిపి రెబల్ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మోహన్ కు ఏపీ హైకోర్టు నోటీసు జారీ చేసింది వంశీ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.