వైరల్: ఆసుపత్రికి వచ్చిన మహిళను సెక్యూరిటీ గార్డ్ మరీ దారుణంగా..?!

మన సమాజం అసలు ఎటు వైపు వెళుతుందో అర్ధం కావడం లేదు.దేశం ఎంత అభివృద్ధి పధంలో ముందుకి దూసుకునిపోతున్న మనుషులు మాత్రం మానవత్వం మరిచి మూర్ఖులుగా తయారవుతున్నారు.

 Viral Security Guard Behaves Rudely With Women Came To Hospital, Women Security-TeluguStop.com

సాటి మనిషి మీద జాలి చూపించడం లేదు సరి కదా.కనీసం వాళ్ళని మనుషులుగా కూడా చూడడం లేదు.మరి కఠినంగా చూస్తున్నారు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళకు సహాయం చేయాల్సినది పోయి అక్కడ ఉండే సెక్యూర్టీ గార్డు అత్యంత దారుణంగా ప్రవర్తించాడు.

ఆ మహిళను ఆసుపత్రి దగ్గరి నుంచి గేటు వరకు చేయి పట్టుకుని బురదలో లాక్కెళ్లి గేటు బయట పడేసాడు.ఇప్పుడు ఈ ఘటనకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాలలోకి వెళితే.బాధాకరమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్గోన్ లో జరిగింది.

అక్కడ ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి మానసిక స్థితి సరిగా లేని ఒక మహిళను ఎవరో తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేసివెళ్లారు.అయితే, ఆమె తనకు చికిత్స చేయాలంటూ అక్కడ వైద్యులను వేడుకుంది.

అయితే ఆవిడ వివరాలు సరిగా చెప్పకపోవడంతో చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు.వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

కానీ, ఆ మహిళ అక్కడ నుండి వెళ్లిపోకుండా అక్కడనే ఉంటూ, వచ్చిపోయే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది.

దీంతో సెక్యూర్టీ గార్డు రంగంలోకి దిగి కనీసం ఒక ఆడది అనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోయి ఆ మహిళను చేయి పట్టుకుని నేలపై నుంచి లాక్కెళ్లాడు.

అలా లాక్కెళ్ళే క్రమంలో నేల మీద బురద ఉన్నాగాని అలాగే లాక్కెళ్లాడు.ఆ మహిళ వేసుకున్న బట్టలు చెదిరిపోయిన గాని అలాగే లాక్కెళ్లి గేటు బయట పడేశాడు.

అయితే, ఈ సంఘటన మొత్తాన్ని అక్కడనే ఉన్న కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ సెక్యూర్టీ గార్డును పదవి నుంచి సస్పెండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube