లగ్జరీ కారులో ప్రయాణం చేసినంత అనుభూతిని కలిగించడంలో వందే భారత్ ట్రైన్లు( Vande Bharat Trains ) ముందుంటున్నాయి.వీటిలో ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా ఉండటం వల్ల రెగ్యులర్ ఫ్లైట్ ప్యాసింజర్లు( Flight Passangers ) కూడా దీని వైపే మళ్లుతున్నారు.
అయితే తాజాగా సెంట్రల్ రైల్వే(CR) ప్రయాణికుల లింగం, వయస్సు ఆధారంగా వందే భారత్ రైళ్ల డిమాండ్‌ను పర్యవేక్షించడం ప్రారంభించింది.వందే భారత్ రైళ్లు అనేవి సెంట్రల్ రైల్వే నాలుగు మార్గాల్లో నడిచే హై-స్పీడ్ రైళ్లు.
వీటిలో మూడు ముంబై నుంచి ప్రారంభమై షిర్డీ, గోవా, షోలాపూర్‌లకు వెళ్తాయి.
ఈ రైళ్లలో ప్రయాణించేవారిలో ఎక్కువ మంది 31 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారేనని, ఆ తర్వాత 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఉన్నారని CR సేకరించిన డేటా చూపిస్తుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 13 వరకు వందే భారత్ రైళ్లలో ప్రయాణించిన పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ ప్రయాణీకుల సంఖ్యను కూడా డేటా వెల్లడించింది.ఈ కాలంలో ఈ రైళ్లలో 85,600 మంది పురుషులు, 57,838 మంది మహిళలు, 26 మంది ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులు ఉన్నారు.పిల్లల సగటు ఆక్యుపెన్సీ (1-14 సంవత్సరాలు) దాదాపు 5% ఉండగా, మొత్తం ప్రయాణికులలో లింగమార్పిడి ట్రాన్స్‌జెండర్ వారు 4.5% ఉన్నారు.

వందేభారత్ రైళ్ల ప్రారంభం విమాన ప్రయాణ పరిశ్రమపై ప్రభావం చూపిందని సీఆర్‌వో చీఫ్ పీఆర్వో శివరాజ్ మనస్‌పురే అన్నారు.పరిశ్రమల అంచనాల ప్రకారం, ఈ రైళ్లు నడపడం ప్రారంభించిన తర్వాత విమానాల రాకపోకలు 10-20% తగ్గాయని, విమాన ఛార్జీలు( Airfare ) ఏకంగా 20-30% తగ్గాయని ఆయన అన్నారు.

వందేభారత్ రైళ్లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడానికి ఇండియన్ రైల్వే అధికారులు( Indian Railways ) ప్రయత్నిస్తున్నారు.సెప్టెంబరులో ఆక్యుపెన్సీ డేటా ప్రకారం ఈ రైళ్లు అన్ని మార్గాల్లో దాదాపు నిండిపోయాయి.ఆక్యుపెన్సీ 77% నుండి 101% వరకు ఉంది.ఈ మార్గంలోని వివిధ స్టేషన్లలో కొంతమంది ప్రయాణికులు ఎక్కి దిగడం వల్ల ఆక్యుపెన్సీ 100% దాటుతుందని రైల్వే అధికారులు వివరించారు.