తెలంగాణ బీజేపీలో అసంతృప్త జ్వాలలు రాజుకున్నాయి.పార్టీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా నేపథ్యంలో కమలం పార్టీలో చిచ్చు రాజుకుంది.
టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అసంతృప్త బాట పట్టారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ముథోల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన రమాదేవికి నిరాశ ఎదురైంది.
దీంతో ఆమె నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.అటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అభ్యర్థిగా నందీశ్వర్ గౌడ్ మరియు నర్సాపూర్ అభ్యర్థిగా మురళీ యాదవ్, రామగుండంలో కందుల సంధ్యారాణికి పార్టీ టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గ నేతలు వ్యతిరేకత కనబరుస్తున్నారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్సీ మోహనరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.