ప్రతి ఒక్కరూ సాహసాలు చేయడం ఇష్టపడతారు.కొంతమంది ప్రమాదకరమైన సాహసాలు చేస్తుంటారు.
ప్రాణాలు రిస్క్‌లో పెట్టి ఈ పనులు చేస్తుంటారు.ముఖ్యంగా ట్రెక్కింగ్,( trekking ) కొండ పై భాగాల్లో రిస్క్ ఫీట్లు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.
ఇదే తరహాలో కొందరు అమ్మాయిలు( girls ) శిఖరం అంచుకు వెళ్లారు.అక్కడ అంత ఎత్తులో ఉయ్యాల ఊగారు.
చివరికి ఉయ్యాల నుంచి జారి పడ్డారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏదైనా ప్రమాదకర విన్యాసాలు చేయాలంటే తగిన శిక్షణ మరియు భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే చేయాలి.భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా మీరు అలాంటి సాహసం చేస్తే, మీరు ఈ వీడియోలో జరిగిందే జరగొచ్చు.రష్యాలోని డాగేస్థాన్ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం కొందరు అమ్మాయిలు శిఖరం పైకి వెళ్లారు.అక్కడ అందరితో పాటు ఇద్దరు ఉత్సాహంగా ఉయ్యాల ఊగారు.కొండ పైన ఉయ్యాల ఊగుతూ ఉల్లాసంగా ఉంటారు.
ఆ స్థలం సముద్ర మట్టానికి 6300 అడుగుల ఎత్తులో ఉంది.ఓ వ్యక్తి ఉయ్యాలను వెనుక నుంచి ఊపుతుంటాడు.ఒక్కసారిగా గట్టిగా ఊపగానే ఆ ఉయ్యాల నుంచి ఇ ఇద్దరు అమ్మాయిలు పడిపోయారు.
అదృష్టవశాత్తూ వారు అక్కడ కొండ కిందకు పడిపోకుండా ఆ శిఖరం అంచునే పడ్డారు.దీంతో వారి ప్రాణాలు దక్కాయి.@SHOCKINGCLIP అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.ఇలాంటి రిస్క్ ఫీట్లు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.