కొండపై నుంచి పడిపోయిన అమ్మాయిలు.. అసలేమైందంటే

ప్రతి ఒక్కరూ సాహసాలు చేయడం ఇష్టపడతారు.కొంతమంది ప్రమాదకరమైన సాహసాలు చేస్తుంటారు.

ప్రాణాలు రిస్క్‌లో పెట్టి ఈ పనులు చేస్తుంటారు.ముఖ్యంగా ట్రెక్కింగ్,( Trekking ) కొండ పై భాగాల్లో రిస్క్ ఫీట్లు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.

ఇదే తరహాలో కొందరు అమ్మాయిలు( Girls ) శిఖరం అంచుకు వెళ్లారు.అక్కడ అంత ఎత్తులో ఉయ్యాల ఊగారు.

చివరికి ఉయ్యాల నుంచి జారి పడ్డారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"""/" / ఏదైనా ప్రమాదకర విన్యాసాలు చేయాలంటే తగిన శిక్షణ మరియు భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే చేయాలి.

భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా మీరు అలాంటి సాహసం చేస్తే, మీరు ఈ వీడియోలో జరిగిందే జరగొచ్చు.

రష్యాలోని డాగేస్థాన్ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం కొందరు అమ్మాయిలు శిఖరం పైకి వెళ్లారు.

అక్కడ అందరితో పాటు ఇద్దరు ఉత్సాహంగా ఉయ్యాల ఊగారు.కొండ పైన ఉయ్యాల ఊగుతూ ఉల్లాసంగా ఉంటారు.

"""/" / ఆ స్థలం సముద్ర మట్టానికి 6300 అడుగుల ఎత్తులో ఉంది.

ఓ వ్యక్తి ఉయ్యాలను వెనుక నుంచి ఊపుతుంటాడు.ఒక్కసారిగా గట్టిగా ఊపగానే ఆ ఉయ్యాల నుంచి ఇ ఇద్దరు అమ్మాయిలు పడిపోయారు.

అదృష్టవశాత్తూ వారు అక్కడ కొండ కిందకు పడిపోకుండా ఆ శిఖరం అంచునే పడ్డారు.

దీంతో వారి ప్రాణాలు దక్కాయి.@SHOCKINGCLIP అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఇలాంటి రిస్క్ ఫీట్లు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.

Validation Check 2026-03-24 10:38:07