ఐపీఎల్ అనేది క్రికెట్ అభిమానులకు అంత్యంత ప్రియమైన క్రీడా ఈవెంట్.వేసవి వచ్చిదంటే చాలు ఫ్యాన్స్ ఐపిఎల్ కోసం ఎదురుచూస్తారు.
అయితే ఈసారి కరొనా వల్ల సజావుగా జరుగుతున్న మ్యాచులు మధ్యలోనే ఆగిపోయాయి.కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
దీనివల్ల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.మ్యాచులను వాయిదా వేయడం వల్ల బీసీసీఐ కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది.
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాతో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కొన్ని వేల కోట్ల రూపాయలను నష్టపోనుంది.ఐపీఎల్ జట్లలో వరుస కరోనా కేసులు నమోదవడంతో క్రీడాకారుల్లో భయం నెలకొంది.
ఐపీఎల్ 2021 సీజన్ ని వాయిదా వేస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.దాంతో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని భారీగా బీసీసీఐ కోల్పోనుంది.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా 29 మ్యాచ్‌లు మాత్రమే ముగిశాయి.బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే అత్యధిక ఆదాయం బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నుంచే వస్తోంది.

ఐదేళ్లకాలానికి స్టార్ స్పోర్ట్స్ రూ.16,347 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ లెక్కన ఏడాదికి రూ.3,369.40 కోట్లని బీసీసీఐకి చెల్లించాల్సి ఉండగా ప్రతి మ్యాచ్ కు రూ.54.50 కోట్లని ఇస్తోంది.అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే ఇప్పటి వరకూ జరిగి ఉండటంతో స్టార్ స్పోర్ట్స్ నుంచి రూ.1,580 కోట్లు మాత్రమే బీసీసీఐకి లభిస్తాయి.ఇక మిగిలిన రూ.1,690 కోట్లని బీసీసీఐ వదులుకునే పరిస్థితి నెలకొంది.ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ స్ఫాన్సర్ గా ఉన్న వివో ఈ ఏడాదికి రూ.440 కోట్లని చెల్లించాల్సి ఉండగా సీజన్ లో సగం మ్యాచ్‌లు మాత్రమే జరగడంతో రూ.220 కోట్లని బీసీసీఐకి ఇవ్వనుంది.ఇక మిగిలిన స్ఫాన్సర్లు డ్రీమ్ 11, అప్‌స్టాక్స్, టాటా మోటర్స్, అన్‌అకాడమీ, సీరెడ్ తదితర స్ఫాన్సర్లు కూడా చెరొక రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉండగా టోర్నీ వాయిదాతో ఈ స్ఫాన్సర్లు అందరూ సగం మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది.మొత్తంగా ఐపీఎల్ 2021 సీజన్ ని నిరవధికంగా వాయిదా వేయడం ద్వారా బీసీసీఐ సుమారు రూ.2,200 కోట్లు నష్టపోనున్నట్లు తెలుస్తోంది.