కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లో కొలువై ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఎంతో పవిత్రమైన ఈ క్షేత్రాన్ని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ఈ విధంగా కలియుగ దైవమైన శ్రీ వారిని 7 కొండలు ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తారు.అయితే కొందరికి తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకొనే స్తోమత లేని వారు ద్వారకా తిరుమలలో మొక్కులు తీర్చుకున్న ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి తీర్చినట్లు అని చెప్పవచ్చు.
తిరుమల తరువాత ఇంత ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరుని ఆలయం ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో వెలసిన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది.
పురాణాల ప్రకారం పూర్వం ద్వారకా మహర్షి అనే ముని ఇక్కడ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కోసం ఘోరమైన తపస్సు చేసి ఆ వేంకటేశ్వరుని అనుగ్రహం పొందాడు.
భక్తుల కోరికలు తీర్చే శ్రీవారు ద్వారక మహర్షిని ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు.అందుకు మహర్షి నీ పాద సేవ చేసుకునే భాగ్యం కల్పించమని వేడుకోగా అతని కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతాయి.
అయితే ఆలయంలోని గోపురం కింద రెండు స్వామివారి మూలవిరాట్ విగ్రహాలు ఉంటాయి.

ద్వారక మహర్షి మునికి ప్రత్యక్షమైన మూలవిరాట్ వక్షస్థలం వరకు మాత్రమే దర్శనం కలిగి ఉంటుంది.స్వామివారి పాదాలు పాతాళ లోకంలో ఉన్నాయని అక్కడి ప్రజలు నమ్మకం.అయితే మరొక మూలవిరాట్ ను శ్రీ రామానుజాచార్యులవారు స్వామివారిని దర్శించుకున్నప్పుడు స్వామి వారి మూల విరాట్ ను చేశారు.
అక్కడ వెలసిన స్వామి వారిని మొక్కితే కోరిన కోరికలు నెరవేరుతాయి, అలాగే అక్కడ ప్రతిష్టించిన స్వామివారిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్షాలు కలుగుతాయని అక్కడి ప్రజల విశ్వాసం.
తిరుమల తిరుపతిలో స్వామివారికి సంవత్సరానికి రెండు సార్లు కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ద్వారకా తిరుమలలో ఉన్న స్వామి వారికి సంవత్సరానికి ఒక్కసారైనా కూడా అభిషేకం జరగక పోవడం విశేషం.ఒకవేళ స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మూలవిరాట్ కింద భాగంలో ఉన్న ఎర్ర చీమలు చెదిరి స్వామివారి విగ్రహాన్ని కప్పి వేస్తాయి అందుకోసమే ఇక్కడ వెలసిన స్వామివారికి అభిషేకాలు నిర్వహించరనీ అక్కడ అర్చకులు తెలియజేస్తున్నారు.