మహాశివరాత్రి రోజు చేసే రుద్రాభిషేకానికి అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా..

ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పవిత్రమైన పండుగను ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తేదీన జరుపుకుంటారు.

 Do You Know Why Rudrabhishekam Performed On Mahashivratri Day Is Special? , Rud-TeluguStop.com

మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ఆరాధించడం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.శివపురాణంలో మహాదేవుని పూజించడానికి కొన్ని తేదీలు చాలా ప్రత్యేకమైనవి గా భావిస్తారు.

అటువంటి వాటిలో మహాశివరాత్రి కూడా ఒకటి.హిందూమతంలో మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ గా భావిస్తారు.

ఈ రోజున శివుడి పార్వతి దేవి ల వివాహం జరిగింది.మహా శివరాత్రి రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భక్తులు ఉపవాసం పాటిస్తారు.మహాశివరాత్రి సందర్భంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి, తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, రుద్రాభిషేకం కూడా చేస్తారు.

రుద్రాభిషేకంతో శివుడు చాలా సంతోషిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.రుద్రాభిషేకం అంటే ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Devotional, Lord Shiva, Mahashivratri, Parvati Devi, Rudrabhishekam, Rudr

రుద్ర ,అభిషేకం అనే రెండు పదాల్లో రుద్రుడు, శివుని స్వరూపం.ఇందులో అభిషేక్ అంటే స్నానం చేయడం.రుద్రాభిషేకం అంటే శివుని రుద్ర రూపాన్ని అభిషేకించడం అని అర్థం వస్తుంది.శివుడి రుద్రాభిషేకం చేయడం ద్వారా శివుడు ప్రతి ఒక్కరి కోరికలను తీరుస్తాడని దీనితో పాటు ఇది గ్రహ దోషాలు, వ్యాధులు, బాధలు పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు.

Telugu Devotional, Lord Shiva, Mahashivratri, Parvati Devi, Rudrabhishekam, Rudr

రుద్రాభిషేక మహిమ శివపురాణంలో కూడా తెలిపారు.మీకు ఏమైన కోరిక ఉంటే భక్తితో రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.శివ లింగంలో శివుని ఉనికిని చూడడం చాలా ముఖ్యం.శివలింగంలోని శివుని నివాసాన్ని చూడకుండా రుద్రాభిషేకం చేయకూడదని శివ పురాణం లో ఉంది.ఫాల్గుణ మాసంలోని మహాశివరాత్రి, ప్రదోష, సోమవారాలలో శివుడు భూమిపై ఉన్న అన్ని శివలింగాల్లో ఉంటాడని వేద పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube