ఒక్క రేషన్ కార్డులో 68 మంది.. కానీ ఒకరితో ఒకరికి సంబంధం లేదు.. ఎక్కడంటే..

ఓకే రేషన్ కార్డులో 68 మంది నమోదై ఉన్నారు.వీరంతా ఓకే కుటుంబానికి చెందిన వారు అనుకుంటే పొరపాటే.

 Fake Ration Card Fraud With 68 Different Members In Bihar ,  One Ration, 68 Memb-TeluguStop.com

ఎందుకంటే వారికి ఒకరితో ఒకరికి సంబంధం లేదు.అంతేకాదు ఇందులో హిందువులతోపాటు.

ముస్లీంలు కూడా ఉన్నారు.ఈ ఫేక్ రేషన్ కార్డులో బీహార్ రాష్ట్రంలో జరిగింది.

ఇందులో ఉన్న సభ్యుల పేర్లు.మతాల వారిగా ఉండడంతో ఈ అనుమానం కలిగింది అక్కడి అధికారులకు.

బీహార్‏లోని మహువా ఎస్డీఓ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ విషయం ఎఫ్ఐఆర్ నమోదు చేసి.విచారణ చేపట్టారు.వన్ నేషన్.వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగంగా.

పీడీఎస్ షాపుల ద్వారా రేషన్ పంపిణిలో తనిఖీ చేస్తున్న ఎస్డీఓ సందీప్ కుమార్‏కు ఒక రేషన్ కార్డులో మతాలకు అతీతంగా పేర్లు ఉండడంతో అనుమానం కలిగింది.పూర్తిగా దర్యాప్తు జరగపగ.

ఓకే కుటుంబానికి ఏకంగా 38 క్వింటాళ్ళ ధాన్యం ఇస్తున్నట్లుగా తెలిసింది.వెంటనే.

చెహ్రాకాలన్ బ్లాక్ డెవలప్‏మెంట్ ఆఫీసర్ కుముద్ రంజన్‏ను దర్యాప్తు జరిపి పీడీఎస్ డీలర్ సంజయ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.

Telugu Block, Dealersandeep, Fraud, Kumudh Ranjan, Latets-Latest News - Telugu

మోసాలకు పాల్పడినందుకు డీలర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.అలాగే ఆహార ధాన్యాలను వీలైనంత తొందరగా రికవరీ చేసుకోవాలని బీడీఓను ఆదేశించినట్లుగా సందీప్ కుమార్ తెలిపారు.వైశాలి జిల్లాలోని బ్లాకులలో రేషన్ కార్డు హోల్డర్లలో ఆహార ధాన్యం పంపిణీ గురించి ఇటీవల పరిశీలించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

అధికారులు ఆహార ధాన్యాలను 38 క్వింటాళ్ళ వరకు ఉమేష్ నేతృత్వంలో ఒకే కుటుంబానికి ఇచ్చినట్లుగా అనుమానం కలిగింది.దీని పై మరింత లోతుగా పరిశీలిస్తే… అసలు విషయం బయటకు వచ్చిందని తెలిపారు.

ఓకే కుటుంబానికి చెందిన 68 మంది లభ్దిదారుల జాబితాను రూపొందించారని.వారికి ఉచితంగా.

సబ్సిడితో కూడిన ఆహార ధాన్యాలను సమర్పించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సందీప్ కుమార్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube