ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది నాయకులు ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇదే సమయంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీలో జాయిన్ అవుతున్నారు.
ఏపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.కొద్ది వారాల క్రితం ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వటం తెలిసిందే.
ఈ క్రమంలో ఆదివారం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు( Chandrababu )…పవన్ ఓటమిల కోసం పనిచేస్తానని ముద్రగడ పేర్కొన్నారు.
ఒక ఎంపీ, ఎమ్మెల్యే కూడా లేకుండా పవన్ పార్టీ పెడితే నేను వెళ్లాలా అని ప్రశ్నించారు.
అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి( Chiranjeevi ) పాలకొల్లులో ఓడిపోయారు.జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.తాను కాపు ఉద్యమం వలన నష్టపోయినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు తనని అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రబాబు నా శత్రువుని.
అటువంటి చంద్రబాబు లాంటి నా శత్రువులతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎలా కలుస్తాడన్నారు.ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారని జోష్యం చెప్పారు.
వైయస్ జగన్ కి పవన్ కళ్యాణ్ కి చాలా తేడా ఉందని 30 ఏళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని ముద్రగడ వ్యాఖ్యానించారు.అంతేకాకుండా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 స్థానాలు కేటాయించారు.
అటువంటి పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలని నిలదీశారు.