టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది సమంతా.ఓవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.పలు బ్రాండ్లకు అంబాసిడర్ గానూ వ్యవహరిస్తుంది.పలు యాడ్స్ లో కూడా నటిస్తుంది.ఇప్పటికే తను పలు యాడ్ ఫిల్మ్స్ చేస్తుంది.అటు సోషల్ మీడియా ద్వారా ఆయా కంపెనీల ఉత్పత్తులన ప్రమోట్ చేస్తుంది.
మొత్తంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే రీతిలో రెండు చేతులా సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఓవైపు తన వ్యక్తిగత జీవితం గురించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
త్వరలో తన భర్త నాగ చైతన్య నుంచి విడిపోతుంది అనే ప్రచారం జరుగుతుంది.మరోవైపు ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
యాడ్స్ కోసం గ్లామర్ డోస్ పెంచి మరీ నటిస్తోంది.గతంలోనూ గ్లామరస్ గా కనిపించినా.
ప్రస్తుతం ఆ డోస్ ను మరింత పెంచింది.తన అందాలతో జనాలను మరింత రెచ్చగొడుతుంది.
తాజాగా ఓ బ్యాగ్ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ షూటింగ్ లో పాల్గొంది సమంతా.

ఈ యాడ్ కు సంబంధించిన షూట్ వీడియో తన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.ఇందులో హాట్ హాట్ గా రెచ్చిపోయింది సమంతా.హాట్ హాట్ లుక్స్ తో పాటు కురచ డ్రెస్సులతో తన అందాలను ఆరబోసింది.
ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించి ఫోటోలతో పాటు యాడ్ మేకింగ్ వీడియో సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

కొద్ది రోజుల క్రితమే గోవా ట్రిప్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఈ అమ్మడు.చైతన్యతో కలిసి ఉండటం లేదనే వార్తలు వస్తున్నాయి.త్వరలో వీరిద్దరు డివోర్స్ తీసుకుంటారనే టాక్ నడుస్తుంది.
వీటన్నింటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది సమంతా.అటు తమ విడాకుల గురించి వస్తున్న వార్తలపై గతంలోనే సమంతా ట్విట్టర్ ద్వారా స్పందించింది.
మీడియాను కుక్కలతో పోల్చుతూ ఫోటో షేర్ చేసింది.అయితే.
చైతన్యతో, తను విడిపోతుందా? లేదా? అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.