వాణిశ్రీ అంటేనే అందం అందం అంటే వాణిశ్రీ( Vanishree ) అనే రేంజ్ లో కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.మహానటి సావిత్రి తర్వాత అందరూ గుర్తించుకునే ఏకైక హీరోయిన్ వాణిశ్రీ అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.
మరి అప్పట్లో వాణిశ్రీ అంటే ఆమె పెట్టుకునే నగలు కట్టుకునే చీరలు, బొట్టు అలాగే ఆమె కొప్పు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా స్పెషల్ గా ఉండి ఫేమస్ అయ్యేవి.అప్పటి యువత మొత్తం వాణిశ్రీని ఫాలో అవుతుండేవారు.
ఆమె కొత్తగా ఏదైనా సినిమాలో నటిస్తుంది అంటే చాలు ఎలాంటి అప్పియరెన్స్ తో వస్తుంది అని తెగ వెతికే వారు.అలా వాణిశ్రీ చీరలు అని కూడా కొన్నాళ్లపాటు అమ్మకాలు కూడా జరిగాయి.
ఆమె పెట్టుకునే ప్రతి ఫ్యాషన్ కూడా అప్పటి యూత్ అంతా ఫాలో అయ్యేవారు.ఇప్పటికి కూడా వాణిశ్రీ ఒక తరానికి మోడల్ గా ఉండి పోయింది.
మరి ఇంతటి ఫ్యాషన్స్ ఉన్న హీరోయిన్స్ ( Heroines )తమ బట్టలను లేదా నగలను వారే డిజైన్ చేసుకుంటూ ఉంటారు.ఆ విషయంలో కూడా వాణిశ్రీ ముందే ఉంటుంది ఎందుకంటే ఆమె సినిమాల్లో ఉన్నంత కాలం ధరించిన నగలన్నీ కూడా తానే సొంతగా డిజైన్ చేసుకున్నారనే విషయం ఆమె బ్రతికున్న సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.అప్పట్లో ఇలా సోషల్ మీడియా, టీవీ ( Social media, TV )ప్రభావం చాలా తక్కువగా ఉండేది.ప్రతిరోజు పేపరు వీక్ కి ఒక మ్యాగజిన్ లేదా నెలవారి పత్రిక వచ్చేవి.
వాటిల్లో ఏ కారణం చేత పెట్టేవారు తెలియదు కానీ చుట్టూ ఒక బోర్డర్ లేదా హంసలు, పువ్వులు, వంపుగా ఏదైనా తీగలతో మంచి డిజైన్స్ వేసి మ్యాగజైన్స్( magazines ) ని ప్రింట్ చేసేవారట.
అలా ప్రతిరోజు వచ్చే డిజైన్స్ నీ కత్తిరించి తను దాచుకునే వారట అవసరానికి తగ్గట్టుగా వాటిల్లో ప్రతిదీ కూడా ఆమె నగగా చేయించి మరి సినిమాల్లో వాడుకునే వారట.అలా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం కూడా ఆ తన సొంత టెస్ట్ తో నగలను చేయించుకొని ధరించారట.ఇక ఇలా సొంతంగా నగలు డిజైన్స్ చేయించుకోవడం అనేది సావిత్రి కూడా ఎక్కువగా చేసేవారు.
ఈ కాలంలో అలా ఒక ఫ్యాషన్ సెన్స్ ఉన్న హీరోయిన్ ఏమాత్రం దొరకడం లేదు ఒక హీరోయిన్ బట్టలు వేసుకున్న, నగలు పెట్టుకున్న ఆ పది సంవత్సరాలు గుర్తు పెట్టుకునే అంత ప్రతిభ అప్పటి నటీమణుల్లో ఉండేది.