సాధారణంగా మనుషులు మాట్లాడాలంటే చాలా కష్టం.ఎందుకంటే ఏ జంతువుకు సంబంధించిన భాష వాటికి ఉంటుంది.
అయితే ఇందులో కొన్ని సార్లు మాత్రం అచ్చం మనుషుల్లాగే ఒక్కోసారి చిలుకలు కూడా మాట్లాడటం మనకు తెలుసు.ఇక చిలుకను మించి ఏ జతువు కూడా మనిషిలాగా మాట్లాడలేదు.
కానీ ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియాలో ఉండే ఓ బాతు అచ్చం మనుషుల్లాగో ఓ డైలాగ్ కొడుతోంది.ఇంకేముంది ఇలా డైలాగ్ కొడితే అది కాస్తా వైరల్ గా మార్చేయడం సోషల్ మీడియాకు అలవాటే కదా.
ఇక దీన్ని కూడా ఇటల్టే వైరల్ చేసేశారు నెటిజన్లు.అయితే ఆ బాతు నీటితో తిరుగుతూ ‘యూ బ్లడీ ఫూల్’ అని అరుస్తోంది.ఆస్ట్రేలియన్ దేశంలోని మస్క్ జాతికి చెందిన ఈ బాతు చాలా స్పెషల్ అని చెబుతున్నారు.అయితే బాతు ఇలా డైలాగ్ కొట్టడాన్ని ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ అనే సంస్థ వారు వీడియో తీసి అలాగే దాన్ని కాస్త రికార్డ్ చేసి సంచలనం సృష్టించారు.
కాగా ఇలా బాతు మాట్లాడటం ఇదే మొదటిసారి అని అది కూడా ఆ బాతు మనుషుల దగ్గరి నుంచే నేర్చుకున్నట్టు చెబుతున్నారు.
ఆ బాతు తన కేర్ టేకర్ తన దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇలా ‘యూ బ్లడీ ఫూల్’ అనే మాటలు ఎక్కువగా వాడటంతో ఆ బాతుకు కూడా అది అలవాటుగా మారి అది కూడా నీటిలో ఈత కొడుతూ సేమ్ టు సేమ్ అలాగే అంటోంది.
అయితే ఇది కచ్చితంగా కేర్ టేకర్ దగ్గరి నుంచే నేర్చుకుందని పరిశోధకులు చెబుతున్నారు.అయితే వాస్తవానికి ఈ మస్క్ జాతికి చెందిన బాతులు ఇలాగే మనుషులు మాటలను నేర్చుకోవడం చాలా కామన్ అని చెబుతున్నారు.
అయితే ఇలా మనుషులను అనుకరిస్తున్న బాతు పేరు రిప్పర్ అని పేరు పెట్టారు ఆ సంస్థకు చెందిన వారు.